iDreamPost
android-app
ios-app

ధర్మవరం ఎమెల్యే గన్‌మెన్‌ కరోనాతో మృతి.. సహచరులకు పాజిటివ్‌.. ఎమ్మెల్యేకు రెండుసార్లు పరీక్ష

ధర్మవరం ఎమెల్యే గన్‌మెన్‌ కరోనాతో మృతి.. సహచరులకు పాజిటివ్‌.. ఎమ్మెల్యేకు రెండుసార్లు పరీక్ష

కరోనా వైరస్‌ సోకి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గన్‌మెన్‌ చనిపోయారు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న గన్‌మెన్‌.. రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయం స్వయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెల్లడించారు.

వైరస్‌ లక్షణాలు కనిపించినప్పుడే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుని ఉంటే గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోయేవాడు కాదని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. కానీ వైరస్‌ సోకిందని చెప్పుకోవడం అవమానంగా భావించిన గన్‌ మెన్‌ ఈ విషయం దాచిపెట్టాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అతను వైరస్‌ సోకిన విషయం దాచిపెట్టడం వల్ల మరో ఏడుగురు కరోనా బారినపడ్డారని ఎమ్మెల్యే చెప్పారు. నలుగురు గన్‌మెన్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని కేతిరెడ్డి వెల్లడించారు. తాను రెండు సార్లు కరోనా పరీక్ష చేయించుకున్నానని, అయితే రెండు సార్లు నెగిటివ్‌ వచ్చిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet