iDreamPost
android-app
ios-app

దేవిశ్రీ ప్రసాద్ కు బంపర్ ఆఫర్

  • Published Mar 29, 2020 | 10:03 AM Updated Updated Mar 29, 2020 | 10:03 AM
  • Published Mar 29, 2020 | 10:03 AMUpdated Mar 29, 2020 | 10:03 AM
దేవిశ్రీ ప్రసాద్ కు బంపర్ ఆఫర్

టాలీవుడ్ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా బాలీవుడ్ టాక్. నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తీస్తున్న రాధేకు ట్యూన్స్ కంపోజ్ చేసే అవకాశం దేవికి వచ్చినట్టుగా తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దేవి గతంలో సల్మాన్ రెడీ రీమేక్ కోసం డింగచిక డింగచిక పాట ఇచ్చి బ్లాక్ బస్టర్ సాంగ్ చేశాడు. మళ్ళీ ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. ఇప్పుడు తాజాగా రాధే కోసం సల్మాన్-దేవి కాంబో పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉందట. ప్రభుదేవాకు దేవికి మంచి ర్యాపొ ఉంది.

దర్శకుడిగా తన మొదటి సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు దేవి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. అది బ్లాక్ బస్టర్ కావడంలో దేవి పాత్ర చాలా ఉంది. తర్వాత పౌర్ణమి ఆశించిన అంచనాలు అందుకోలేకపోయినా పాటల వరకు నిరాశపరలేదు. ఇప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బమ్ గా అభిమానులు చెప్పుకుంటారు. ఆ తర్వాత చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ కోసం కలిసి పనిచేశారు కానీ ఫలితం దక్కలేదు. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్లకు దేవిశ్రీ ప్రసాద్ కు ప్రభుదేవా రూపంలో బాలీవుడ్ ఆఫర్ దక్కనుంది.

దబాంగ్ 3 భారీ హిట్ కాకపోయినా ప్రభుదేవా వర్కింగ్ స్టైల్ నచ్చిన సల్మాన్ తనకు వెంటనే రాధే ఛాన్స్ ఇచ్చాడు. జూన్ లో రంజాన్ పండగకు రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా గొడవ సద్దుమణిగాక తిరిగి ప్రారంభిస్తారు. కానీ జరిగిన జాప్యం వల్ల ఆ డెడ్ లైన్ మీటవ్వదం డౌటే. అందుకే దీనికి సంబంధించి క్లారిటీ రావడానికి మరికొంత టైం పట్టేలా ఉంది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో మంచి హిట్ అందుకున్న దేవి తన స్థాయి ఆల్బం ఇచ్చి చాలా రోజులయ్యింది. ఇప్పుడీ రాధే ఛాన్స్ ని కనక సరిగ్గా వాడుకుంటే దేవికి హిందీలో మంచి ఇన్నింగ్స్ ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet