ఇంటి పని చేయమని భర్త చెప్పడం క్రూరత్వం కాదు: హైకోర్టు

ఇంటి పని, వంట పని, ఇంతేనా మహిళ పని.. లోకమెంత మారినా మా బ్రతుకు మారదేమీ అని చింతిస్తున్న మహిళలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు నిచ్చింది. ఇంతకు ఆ తీర్పు ఏంటంటే..?

ఇంటి పని, వంట పని, ఇంతేనా మహిళ పని.. లోకమెంత మారినా మా బ్రతుకు మారదేమీ అని చింతిస్తున్న మహిళలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు నిచ్చింది. ఇంతకు ఆ తీర్పు ఏంటంటే..?

ఇంటి పని, వంట పని మహిళలదే అని భావన ఉంది. పొద్దున్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టి.. వంటంతా సిద్దం చేసి, పిల్లల్ని రెడీ చేసి బడికి పంపి, భర్తను ఆఫీసుకు వెళ్లాక ఇల్లంతా చక్కబెడుతుంది ఇల్లాలు. అలాగే అత్తా మామలకు సపర్యలు చేయాల్సిందే. దీని వల్ల చాలా మంది గృహిణులు ఇంట్లోనే మగ్గిపోతున్నారు. దీంతో తాము ఏదో కోల్పోయామని ఫీల్ అవుతున్నారు మహిళలు. ఇంట్లో పని చేసుకోలేక వేరో కాపురం పెట్టాలంటూ భర్తలను హింసిస్తున్నారు. సరిపెట్టుకోవాలన్నా, ఇంట్లో పని నువ్వు కాక మరెవ్వరూ చేస్తారంటూ భర్త కాస్తంత మందలించినా.. వేధిస్తున్నారంటూ పెళ్లిని పెటాకులు చేసుకునేందుకు సిద్దమౌతున్నారు కొంత మంది మహిళలు.  అలాంటి వారికి షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు.

వేరో కాపురం పెట్టమని భర్తను భార్య కోరడం తప్పే అవుతుందన్న కోర్టు.. భార్య ఇంటి పనులు చేయాలని భర్త కోరడం క్రూరత్వంగా పేర్కొనలేమని తేల్చి చెప్పింది. వివాహ జీవితంలోకి భార్యా భర్తలు అడుగుపెట్టినప్పుడు.. బాధ్యతలు ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచించింది. భార్య క్రూరత్వం కారణంగా వివాహాన్ని రద్దు చేయాలంటూ కుటుంబ న్యాయ స్థానంలో దాఖలు  చేసిన పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ.. ఓ వ్యక్తి  హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్ పై విచారణ చేపట్టింది న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం. ‘వివాహిత స్త్రీని ఇంటి పని చేయమని అడిగితే.. దానిని పనిమనిషి పనితో పోల్చలేము. ఇంటి పని కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతగా పరిగణించబుతుంది’ అంటూ సదరు వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది.

సీఐఎస్ఎఫ్ జవాన్ 2007లో మహిళను వివాహం చేసుకోగా, 2008లో కుమారుడు జన్మించాడు. భార్య తరచూ భర్త, అతడి కుటుంబ సభ్యులతో గొడవ పడి.. పని చేయనంటూ తేల్చి చెప్పేది. ఆమె ప్రవర్తన అతడికి చికాకు కలిగించడంతో.. కోర్టు మెట్టెక్కాడు. కాగా, తాను ఇంటి పనులు చేశానని, అయితే తన భర్త, అతడి ఫ్యామిలీ సంతృప్తి చెందలేని భార్య వివరణ ఇచ్చింది. భార్య కోరికను, ఆనందాన్ని కాదనలేక.. వేరే కాపురం కూడా పెట్టాడు. కానీ ఆమె ఎక్కువగా తన తల్లిదండ్రులతో జీవించేది. ఇవన్నీ పరిశీలించిన కోర్టు.. ఆమెకు భర్తతో, ఉమ్మడి కుటుంబంలో జీవించే ఉద్దేశం లేదని, తాత్కాలిక ఉపశమనం జీవిత భాగస్వామిలో అభద్రతా భావాన్ని కలిగిస్తుందని, మహిళ తన బాధ్యతలను విస్మరించడమే కాకుండా.. అతని కొడుకు, తండ్రిని దూరం చేసిందని పేర్కొంటూ.. అతడికి విడాకులు మంజూరు చేసింది.

Show comments