iDreamPost
android-app
ios-app

వణికిస్తున్న చలి.. అక్కడ సంక్రాంతికి ముందే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

  • Published Jan 08, 2024 | 2:35 PM Updated Updated Jan 08, 2024 | 2:35 PM

ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశంలో చలి తీవ్రత పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీనితో కొద్దిరోజుల పాటు అక్కడి పాఠశాలలకు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం.

ప్రస్తుతం శీతాకాలం కావడంతో దేశంలో చలి తీవ్రత పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీనితో కొద్దిరోజుల పాటు అక్కడి పాఠశాలలకు సెలవలు ప్రకటించింది ప్రభుత్వం.

  • Published Jan 08, 2024 | 2:35 PMUpdated Jan 08, 2024 | 2:35 PM
వణికిస్తున్న చలి.. అక్కడ సంక్రాంతికి ముందే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

ప్రస్తుతం శీతల వాతావరణం కారణంగా దేశంలో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీనితో ఎముకలు కొరికే చలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దేశంలో కరోనా కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో.. ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు పంపాలంటే కష్ట తరంగ మారింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో జనవరి 12వ తేదీ వరకు.. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్నీ అక్కడి విద్యా శాఖ మంత్రి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ప్రకటించారు.

విద్యా శాఖ మంత్రి అతిషి తన ఎక్స్ ఖాతాలో.. కోదిరోజులు పాఠశాలలు మూసి వేయడంపై ఇలా వ్రాశారు, “ప్రస్తుతం ఉన్న చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఢిల్లీలోని పాఠశాలలలో నర్సరీ నుండి 5వ తరగతి విద్యార్థులకు, రాబోయే ఐదు రోజులు పాఠశాలలు మూసివేయబడతాయి.” అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని కూడా ఈ ఆదేశాలను పాటించాలని మంత్రి తెలియజేశారు. ప్రాథమిక స్కూల్ విద్యార్థులకు వీలును బట్టి ఆయా పాటశాలల యాజమాన్యం ఆన్ లైన్ తరగతులను నిర్వహించవచ్చని చెప్పారు. ఈ విద్యార్థులకు తిరిగి జనవరి15న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలియజేశారు. కానీ, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని .. ప్రతి పాఠశాల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తీసి ఉంచాలని చెప్పారు.

కాగా, తాజాగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 15.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ఇంకా తక్కువగానే నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో తీవ్రమైన చలి కారణంగా.. రోడ్లన్నీ పొగ మంచుతో కప్పి వేయబడుతున్నాయి. దీనితో వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు మరోవైపు గ్రేటర్ నోయిడాలోను ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడ కూడా… అన్ని పాఠశాలలకు జనవరి 14 వరకు సెలవులు ఇవ్వాలని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మరి, దేశంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతూ ఉండడంతో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు తెలియాజేశారు. మరి, ఢిల్లీలో విద్య శాఖ మంత్రి వాతావరణ పరిస్థితుల విషయమై తీసుకున్న నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.