iDreamPost
android-app
ios-app

ఫ్లెక్సీ కడుతూ జగన్ ఆప్త మిత్రుడి మరణం

ఫ్లెక్సీ కడుతూ జగన్ ఆప్త మిత్రుడి మరణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు ఏడిద జగదీష్ ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలయ్యారు. గతంలో జగన్ ని ప్రజాసంకల్పయాత్ర అనకాపల్లిలో నిర్వహించినపుడు జగన్ స్నేహితులు ఆయనను కలిసారు. బాగున్నారా అంటూ ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ జగదీష్ వద్ద తాము చదువుకున్నప్పటి ఫోటోలు చూసి ఇతర బాల్య స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలా కలిసి వచ్చినపుడు జగదీష్ ఫొటోలు తీసుకున్నారు. తాజాగా సీఎం జగన్‌పై తన అభిమానం చాటుకునే ప్రయత్నంలో ఆ ఫొటోలను ఫెక్సీలు వేసి కట్టే ప్రయత్నంలో జగదీష్ తోపాటు మరో వ్యక్తి ప్రాణాలు వదిలారు.

ఫ్లెక్సీని డాబా మీదినుంచి కిందకు వేలాడదీసే క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఆయన మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. సీఎం జగన్, అనకాపల్లిలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన ఏడిద జగదీష్ చిన్నప్పుుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. జగదీష్ కి జగన్ అంటే ఎంతో అభిమానం.. మొదటినుంచీ రాజకీయంగా జగదీష్ జగన్ అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. జగన్ ను పాదయాత్రలోనూ, ఇతర పలు సందర్భాల్లోనూ కలిసారు. పరిసర ప్రాంతాల్లో జగన్ నిర్వహించే ప్రతీ కార్యక్రమానికీ హాజరయ్యేవారు.

ఈనేపధ్యంలో జగదీష్ తాను చిన్నతనంలో జగన్ తో కలిసి చదువుకున్న ఫొటోలు, పాదయాత్రలో కలిసిన ఫొటోలు కలిపి భారీ ఫ్లెక్సీ చేయించారు.. అప్పటివరకూ ఎంతో సంతోషంతో ఉన్న జగదీష్ తనకు మిత్రుడు, ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోబోతున్నానని భావించారు.. దీనికోసం ఫ్లెక్సీ కట్టేందుకు మేడపైకి ఎక్కారు.. ఫ్లెక్సీ కట్టడానికి సాయం చేయాలని స్థానికుడు ముప్పిడి శ్రీను అనే వ్యక్తి సాయం తీసుకున్నారు. ఇద్దరూ ఫ్లెక్సీ కడుతుండగా ఒక్కసారిగా గాలి వీయడంతో ఫ్లెక్సీ ఫ్రేమ్ ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది.. అంతే ఒక్కసారిగా షాక్ కొట్టడంతో ఇద్దరూ  కింద పడిపోయారు.. ఇద్దర్నీ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జగదీష్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఇరువురు కుటుంబాలతో పాటుగా అనకాపల్లి వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. విషయం తెలిసి సీఎం జగన్ సైతం విషాదానికి గురైనట్టు సమాచారం.