అత్తకు అన్నీ తానై.. అతిమ సంస్కారాలు చేసిన కోడలు!

అత్తకు అన్నీ తానై.. అతిమ సంస్కారాలు చేసిన కోడలు!

సాధారణంగా అత్తాకోడళ్లంటే మనకు గిల్లి కజ్జాలే గుర్తుకు వస్తాయి. నిత్యం ఏదో ఒక విషయంపై వారిద్దరు గొడవ పడుతునే ఉంటారు. మరోవైపు అత్తలకు ముద్ద అన్నం పెట్టకుండా ఈసడించ్చుకునే కోడలు కూడ మనకు కనిపిస్తుంటారు. వృద్ధాప్యంలో ఉన్న అత్తలకు ఎందరో కోడళ్లు నరకం చూపిస్తుంటారు. “ఈ మహాతల్లి ఎప్పుడు పోతాదా?” అని వెయ్యికళ్లతో ఎదురు చూసే కోడళ్లకు కొదవేలేదు. ఇలాంటి కోడళ్లందరూ ఓ మహిళను చూసి బుద్ధి మార్చుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్న అత్తను కంటికి రెప్పల చూసుకుంది. అంతేకాక ఆమె చనిపోతే.. అన్నీతానే.. అత్త అతిమ సంస్కారాలను ఆ కోడలు నిర్వహించింది. కొడుకుగా మారి.. అత్తకు తలకొరివి పెట్టింది. ఈ హృదయానికి హత్తుకునే ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ లో బుర్రా తిరుపతమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు.. తన కోడలితో కలిసి నివాసం ఉంటుంది. తిరుపతమ్మ కోడలు సంధ్య స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. తిరుపతమ్మ కుమారుడు సురేశ్ సింగరేణిలో పని చేసేవాడు. అలా సింగరేణిలో పని చేస్తూ..తన కుటుంబాన్ని పోషించే వాడు. అయితే ఆరేళ్ల క్రితం తిరుపతమ్మ కుమారుడు సురేష్ మరణించాడు. తిరుపతమ్మకు కుమారుడు తప్ప మరెవరు లేరు. కొడుకు చనిపోయిన దగ్గర నుంచి కోడలు సంధ్య వద్దనే తిరుపతమ్మ ఉంటుంది. సంధ్య కూడా తన అత్తను సొంత తల్లిలాగా భావించే కంటికి రెప్పలా చూసుకునేది. అత్తకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ… ఏ కష్టం రాకుండా చూసుకునేది.

అయితే గత కొంతకాలం నుంచి తిరుపతమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. అలానే రోజులు వెల్లదీస్తున్న తిరుపతమ్మ బుధవారం మృతి చెందారు. దీంతో తిరుపతమ్మ అంత్యక్రియలను సంధ్య నిర్వహించారు. తిరుపతమ్మను తల్లిగా భావించి..తలకొరివి పెట్టింది. ఈ ఘటన చూసిన స్థానికి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాక కష్టకాలంలో వృద్ధురాలిని ఆదుకోవడంతో పాటు సొంత బిడ్డల అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో సంధ్యపైను అభినందించారు. ఇలాంటి కోడలు ఉంటే ఏ అత్తకు కష్టాలు ఉండవని కొందరు అభిప్రాయా పడుతున్నారు. మరి.. అత్తకు తలకొరివి పెట్టిన ఈ కోడలిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హ్యాట్సాఫ్: కోడలికి కిడ్నీ దానం చేసిన 70 ఏళ్ల అత్తమ్మ!

Show comments