iDreamPost
android-app
ios-app

కోలీవుడ్ లో దర్బార్ మంటలు

  • Published Feb 07, 2020 | 12:09 PM Updated Updated Feb 07, 2020 | 12:09 PM
కోలీవుడ్ లో దర్బార్ మంటలు

అదేంటి రజినీకాంత్ దర్బార్ రావడం ఆల్మోస్ట్ వెళ్లిపోవడం కూడా అయిపోయింది కదా కొత్తగా నిప్పు రాజేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా. మ్యాటర్ వేరే ఉంది లెండి. ఇక్కడంటే తక్కువ రేట్లకే కొనేసి తక్కువ నష్టాలు తెచ్చుకున్నారు కానీ తమిళనాట బయ్యర్లు దీని మీద భారీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా డబ్బులు పోగొట్టుకున్నారు. పేట రేంజ్ లో ఆడినా సమస్య ఉండేది కాదు కానీ దర్బార్ అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు రజనిని మురుగదాస్ ని టార్గెట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం రజనికాంత్ ఇంటి దగ్గర నిరసన తెలిపితే ఆయన కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదట. మరోవైపు మురుగదాస్ వీళ్ళ నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఏకంగా కోర్టులో పిటీషన్ ఫైల్ చేశాడు. ఇప్పుడీ వివాదం కోలీవుడ్ లో సెగలు రేపుతోంది. గతంలో లింగా లాంటి డిజాస్టర్లు వచ్చినప్పుడు రజని ఎంతోకొంత నష్టాలు భర్తీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడా సూచనలేమి లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్నీ ఇక్కడితో వదిలేది లేదు అంటున్నారు.

మరోవైపు లైకా అధినేత విదేశాల్లో ఉండటంతో అతన్ని సంప్రదించే అవకాశం బయ్యర్లకు లేకుండా పోయింది. దీంతో హీరో దర్శకుడిని డిమాండ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. రజని ప్రస్తుతం శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ దీపావళికే రిలీజ్ చేయాలనే ప్లానింగ్ తో పనులు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడీ వివాదం వెంటనే చల్లారుతుందో లేక ఇంకేదైనా మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. సంక్రాంతికి వేరే స్టార్ల నుంచి దర్బార్ కు పోటీ లేకపోయినా దర్బార్ ఈ స్థాయిలో నష్టాలు తెచ్చుకోవడం నిజంగా విచారకరం.