సినిమాల్లో విలన్ల పని అయిపోయింది అని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. కొత్త తరం కుర్రాళ్లకి మనం సినిమాల్లో చూపించే విలన్లు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్లెప్పుడూ విలన్లని చూడలేదు అంటాడు సల్మాన్.
అయితే వాస్తవం ఏమంటే సొసైటీలో హీరోలు ఉన్నా, లేకపోయినా గ్యారెంటీగా విలన్లు మాత్రం ఉంటారు. కాకపోతే విలన్ రూపం మారింది. పూర్వం స్మగ్లర్లు , బ్యాంకులు దోచేవాళ్లు విలన్లుగా ఉంటే, తర్వాత సినిమాల్లో రాజకీయ నాయకులు, రౌడీలు వచ్చారు. ఇప్పుడేంటంటే విలన్ రూపం, స్వరూపం అర్థం కాక, ఎలాంటి విలన్లని సృష్టించాలో తెలియని అయోమయంలో రచయితలు, దర్శకులు చిక్కుకున్నారు. అందుకే మూస విలన్లు తెరమీద కనిపిస్తున్నారు.
దాదాపు 30 సంవత్సరాలు బాలీవుడ్‌లో హీరోగా ఉన్నవాళ్లు అరుదు. ఆ క్రెడిట్ సల్మాన్‌ఖాన్‌కి దక్కింది. అయితే దీనికి చాలా కష్టపడ్డానని ఆయనంటాడు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సీనియర్లతో పోటీ పడ్డానని, అయితే జూనియర్లతో పోటీ పడడానికి అప్పటి కంటే పదిరెట్లు కష్టపడుతున్నానని అంటాడు.
దబాంగ్-3 ప్లాప్ కావడంతో సల్మాన్ కాస్తా డీలాపడ్డాడు. డైరెక్టర్ కంటే ప్రభుదేవా డ్యాన్సర్‌గా ఉండడమే బెటర్ అని సల్మాన్ అభిమానులు అంటున్నారు.