కొంప ముంచిన కరివేపాకు.. ఫైన్ పడేలా చేసింది

గతంలో కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు.. అదేదో విష పదార్థం లాగా కంచం చివరకో, బయటకు పడేసేవారే తప్ప అస్సలు తినేవారే కాదూ. కానీ ఇప్పుడు దానిలో ఉన్న పోషక విలువలు తెలిశాక వినియోగం పెరిగింది. కరివేపాకుకు డిమాండ్ ఏర్పడింది. గతంలో కూరగాయలు కొంటే ఫ్రీగా ఇచ్చేవారు దుకాణం దారులు. ఇప్పుడు కరివేపాకు ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఐదు రూపాయలు లేనిది ఇవ్వడం లేదు. పోనీ వదిలేద్దామా అంటే.. కూర వండినట్లు అనిపించదు. అందులోనూ భారతీయుల వంటకాల్లో కంపల్సరీగా కరివేపాకు ఉండాల్సిందే. అది ఇండియా అయినా, అమెరికాలో జీవించినా. అయితే కరివేపాకు  ఓ మహిళను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. కర్రీ లీవ్స్ తిన్నందుకు కాదూ.. విదేశాలకు తీసుకెళ్లినందుకు.

న్యూజిలాండ్ ఎయిర్ పోర్టులో ఓ భారత మహిళకు కరివేపాకు వల్ల ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ నుండి ఆమె రకరకాల పదార్ధాలను తీసుకెళ్లగా.. కస్టమ్స్ అధికారుల చేపట్టిన తనిఖీలో కరివేపాకు, తరిగిన అల్లం కనిపించాయి. అయితే పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే న్యూజిలాండ్‌లో ప్లాంట్స్, ప్లాంట్స్ ప్రొడక్ట్ తీసుకెళ్లాలంటే డిక్లేరషన్ లో పేర్కొనాలి. అయితే ఆ ప్లేసులో మహిళ నో అని టిక్ పెట్టింది. ఆమె అబద్దం చెప్పిందని భావించిన అధికారులు.. ఆ మిగిలిన సామాన్లను సర్ది కరివేపాకు, అల్లం మాత్రం తీసుకెళ్లరాదని సూచించారు. వీటి వల్ల బయో సెక్యూరిటీ రిస్క్ ఎక్కువని, విషపూరిత కీటకాలు దేశంలోకి ప్రవేశిస్తాయని, వీటి వల్ల అనారోగ్యాలు వస్తాయని అధికారులు వెల్లడించారు.

బయో సెక్యూరిటీ యాక్ట్ కింద.. తమ చట్టాలను బ్రేక్ చేశారంటూ..ఆమెకు 200 డాలర్ల ఫైన్ వేశారు. అంటే భారత కరెన్సీలో పదివేల రూపాయలన్నమాట. అంతేకాకుండా ఆమె ఫుల్ బ్యాగ్ సెర్చ్ చేశారు. అందులో ఉన్న దుప్పట్ల దగ్గర నుండి అన్నింటిని తనిఖీలు చేశారు.  ఆమెను ఓ క్రిమినల్ ట్రీట్ చేసినట్లు చేశారు. ఆమె కరివేపాకు కోసం ఆశపడితే..అవమానంతో పాటు ఫైన్ పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తోంది. ఐదు రూపాయల కరివేపాకు, అల్లం తీసుకెళ్లడంతో పాటు ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల కస్టమ్స్ అధికారుల నుండి ప్రశ్నలతో పాటు అవమానాలు ఎదుర్కొంది.

Show comments