iDreamPost
android-app
ios-app

White Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య మాయం!

  • Published Nov 14, 2024 | 5:11 PM Updated Updated Nov 14, 2024 | 5:11 PM

White Hair: చాలా మంది కూడా తెల్ల జుట్టు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే వైట్ హెయిర్ సమస్య ఈజీగా తగ్గుతుంది.

White Hair: చాలా మంది కూడా తెల్ల జుట్టు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే వైట్ హెయిర్ సమస్య ఈజీగా తగ్గుతుంది.

White Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య మాయం!

ఈరోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్. చాలా మంది యువత 30 ఏళ్ల దాటకుండానే తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయస్సు లోనే ఈ సమస్యతో బాధ పడే వారు చాలా ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు ముసలి వాళ్ళకే వుండే తెల్ల జుట్టు ఇప్పుడు ఈ వయసు, ఆ వయసు అని ఏం లేదు. అందరికీ వచ్చేస్తుంది. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, పత్తి ఒత్తిడి, ఆందోళన, అధిక కోపం లాంటి చాలా కారణాలు తెల్ల జుట్టుకి దారితీస్తున్నాయి. తెల్ల జుట్టు ఉంటే కచ్చితంగా ఆత్మవిశ్వాసం కోల్పోతాం. అయితే ఈ సమస్యని పూర్తిగా తగ్గించాలంటే జుట్టుకి కేర్ తీసుకోవాలి. మనం మన హెయిర్ కి ఏం వాడుతున్నాము? ఏం వాడాలి? ఏం వాడకూడదు కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం వైట్ హెయిర్ ప్రాబ్లెంని ఈజీగా తగ్గించుకోగలం. ఇక ఈ ప్రాబ్లంని తగ్గించుకోవడానికి కొన్ని న్యాచురల్ టిప్స్ ఉన్నాయి? అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా మీరు మార్కెట్లో దొరికే షాంపులను వాడటం తగ్గించాలి. ఎందుకంటే వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీ జుట్టు పాడయ్యే అవకాశం ఉంటుంది. మనకు సహజంగా దొరికే వాటిలో కరివేపాకు ఒకటి. ఇందులో హెల్తీ హెయిర్ కి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో పొటాషియం, విటమిన్లు ఇంకా ఎన్నో మినరల్స్ ఉంటాయి. కరివేపాకు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు కొన్ని కరివేపాకులని తీసుకొని వాటిని గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొండి. తరువాత ఆ పేస్ట్ ని రోజూ మీ తలపై అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. కాసేపు ఆగాక చల్లని నీటితో తల స్నానం చేయాలి. ఇలా రోజూ చేయడం వలన మీకు తెల్ల జుట్టు సమస్య ఈజీగా తగ్గిపోతుంది.

అలాగే తమలపాకు కూడా మీ స్కాల్ప్ ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తెల్ల జుట్టుని కంట్రోల్ చేయడమే కాకుండా చుండ్రును నియంత్రించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేగాక మీ జుట్టును మందంగా, పొడవుగా చేస్తుంది. తమలపాకులను కూడా బాగా కడిగి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక టేబుల్‌స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి, మీ జుట్టుకు అప్లై చేసి, ఒక గంట తర్వాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే కచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు. అలాగే 4-5 తమలపాకులు, కొబ్బరి నూనె 1-2 టేబుల్ స్పూన్లు, 1 టీస్పూన్ కాస్టర్ ఆయిల్, ఒక 10 కరివేపాకులు తీసుకోవాలి. తమలపాకులను, కరివేపాకులను గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్, కొబ్బరి నూనె, కాస్టర్ ఆయిల్, కొన్ని చుక్కల నీరు వేసి బాగా కలపండి. ఇక ఈ పేస్ట్ ని మీ తలకు, జుట్టుకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత, 30 నిమిషాల తర్వాత షాంపుతో కాకుండా కుంకుడు కాయలతో తల స్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేశారంటే మీకున్న తెల్ల జుట్టు సమస్య చాలా ఈజీగా మాయం అవుతుంది.

ఇంకో విషయం ఏమిటంటే ఒక వెహికల్ కి పెట్రోల్ ఎలాగో మన తలకి ఆయిల్ అలాగా అనే విషయం మరిచిపోవద్దు. తలకు ఏదోక న్యాచురల్ ఆయిల్ డెయిలీ అప్లై చేయండి. కొబ్బరి నూనె, ఆముదం లేదా కాస్టర్ ఆయిల్ అయితే తలకు చాలా మంచిది. వీటిలో ఏదోక ఆయిల్ ని లైట్ గా వేడి చేసి మీ తలకు అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేసుకోండి. ఇలా ప్రతి రోజూ ఈ టిప్స్ కచ్చితంగా పాటించండి. మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణులు, వైద్యులు తెలిపిన వివరాల ఆధారంగా ఇచ్చాము. దీన్ని iDREAM Media నిర్ధారించలేదు. ఏవైనా సందేహాలుంటే వైద్యులని సంప్రదించాలి.