iDreamPost
android-app
ios-app

అర్థరాత్రి గర్ల్స్ హాస్టల్ లో అలా.. భయంతో పరుగులు తీసిన బాలికలు

అర్థరాత్రి గర్ల్స్ హాస్టల్ లో అలా.. భయంతో పరుగులు తీసిన బాలికలు

అది గర్ల్స్ హాస్టల్, పైగా అర్థరాత్రి 12 గంటల సమయం. అన్ని రూమ్ ల్లో బాలికలు సోయి మరిచి నిద్రపోతున్నారు. కట్ చేస్తే.. ఊహించని ఘటన జరగడంతో ఆ బాలికలు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక అదే రాత్రి హాస్టల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో హాస్టల్ సిబ్బంది ఒక్కసారిగా ఖంగారుపడ్డారు. ఈ విషయం తెలుసుకుని పిల్లల తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, గురువారం రాత్రి బాలికలు అందరు హాస్టల్ తిని పడుకున్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఉన్నట్టుండి కరెంట్ షాక్ తో వైర్లు అన్ని కాలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చి హాస్టల్ మొత్తం పూర్తిగా కరెంట్ పోయింది. ఆ మంటలను చూసి పిల్లలకు ఏం చేయాలో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు.

హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు 500 మంది విద్యార్థులను స్థానికంగా ఉన్న ఓ గుడి వద్ద తీసుకెళ్లారు. ఇక విద్యుత్ అధికారులు స్పందించి హాస్టల్ లో షాక్ గురై పాడైన తీగలను సరి చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను మళ్లీ హాస్టల్ కు పంపించారు. మరుసటి రోజు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరికి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తెలియడంతో హాస్టల్ కు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: అధికారులకు మంత్రి హరీశ్‌ రావు కీలక ఆదేశాలు!