iDreamPost

అధికారులకు మంత్రి హరీశ్‌ రావు కీలక ఆదేశాలు!

  • Author Soma Sekhar Published - 12:33 PM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Published - 12:33 PM, Fri - 21 July 23
అధికారులకు మంత్రి హరీశ్‌ రావు కీలక ఆదేశాలు!

రాష్ట్రంలో కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్లలో నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక వర్షాలు అధికంగా ఉండటంతో.. వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే హెలికాప్టర్లు వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. కాగా.. రోడ్డు రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం అవసరమైతే హెలికాప్టర్లు వినియోగిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు, వైద్యారోగ్య శాఖ సన్నద్ధత తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గురువారం అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో సచివాలయంలో నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా.. ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119ను ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. ఇదే రీతిలో జిల్లా స్థాయిలో, ఏరియా, సీహెచ్ సీ.ఎంసీహెచ్ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇక మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ హస్టళ్లను సందర్శించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్ రావు. ముఖ్యంగా పాము కాటు, తేలు కాటులకు సంబంధించిన మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని హరీష్ రావు సూచించారు. అలాగే వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందుగానే జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల నిల్వల్లో నిర్లక్ష్యం వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు.

ఇదికూడా చదవండి: వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు! ఫాలో అయిపోండి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి