Idream media
Idream media
కరోనా కట్టడిపై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసును నమోదు చేశారు. కర్నూలు కేంద్రంగా ఎన్ 440 అనే స్ట్రెయిన్ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని సుబ్బయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారంతో పలువురి చావుకు కారణమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు.. చంద్రబాబుపై 188, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అంతేకాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద నాన్‌బెయిల్ సెక్షన్లను నమోదు చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు వింత వాదనలు చేస్తున్నారు.
ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చంద్రబాబు ప్రచారం ఓ రకంగా ప్రజలకు భయాందోళనకు గురి చేసింది. కొత్త వైరస్ అంటూ తెరపైకి తేవడం ఇటువంటి పరిస్థితిలో కాస్త కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఈ మేరకు ఓ న్యాయవాది ఫిర్యాదును టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంక్రటావ్ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా ఎన్440కే వైరస్ పై ప్రతికలో వచ్చిన కథనాలను చంద్రబాబు ఉటంకించడం లేదు. నేరుగా ఆయనే పరిశోధన చేసి గుర్తించినట్లుగా ప్రచారం చేశారు. దీనిపై ఇప్పుడు కేసు నమోదు కావడంతో టీడీపీ శ్రేణులు కలవరానికి గురవుతున్నారు.
కరోనా తొలి దశ, దేవాలయాలపై దాడులు.. ఇలా సున్నిత, వివాదాస్పద అంశాలపై టీడీపీ తీరు ఇలా ఉంది. ప్రజలను రెచ్చగొట్టేలానే వ్యవహరించిందన్న అపవాదు మూటగట్టుకుంది. ఇప్పుడు కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో కట్టడికి ప్రభుత్వం రోజురోజుకూ కఠిన చర్యలు చేపడుతూనే ఉంది. మరోవైపు.. ప్రజలు భయాందోళన చెందకుండా, ప్రశాంతంగా జీవించేలా కరోనాపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. కానీ, ఇంతలో చంద్రబాబు నాయుడు కొత్త వైరస్ అంటూ తెరపైకి తెచ్చిన ప్రచారం కాస్త గందరగోళానికి గురి చేసింది. ఇది కొత్తది కాదని గతేడాదే గుర్తించారని కొందరు, అటువంటిది ఏమీ లేదని ఇంకొందరు నిపుణులు చెబుతున్నప్పటికీ వైరస్ పేరుతో టీడీపీ గందరగోళానికి తెర తీసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది.