iDreamPost
iDreamPost
హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తిని అడ్డుకుందని 30 ఏళ్ల మహిళను స్పీడుగా వెళ్తున్న రైలు నుండి బయటకు తోసేశాడు. ఆ సమయంలో ఆమె తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తుస్తోంది. ముగ్గురు ప్రయాణికులు మినహా కోచ్ మొత్తం ఖాళీగా ఉంది.
ఫతేబాద్‌లోని తోహానా స్టేషన్‌లో ట్రయిన్ ఆగినప్పుడు ఒంటరిగా ఏడుస్తున్న బాలుడిని చూసిన తండ్రి ఏం జరిగిందని అడిగితే, తల్లిని ట్రయిన్ నుంచి బైటకు తోసేశాడని చెప్పాడు.
ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను చూసిన నిందితుడు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆమె ఎదురు తిరిగింది. ఆ వ్యక్తి ఆమెను రైలు నుంచి బయటకు తోసి, తానూ దూకాడని పోలీసులు తెలిపారు.
ఆమె గత కొన్ని రోజులుగా రోహ్‌తక్‌లో ఉంటోంది. గురువారం రాత్రి 145 కిలోమీటర్ల దూరంలోని తోహానాకు తిరిగి వచ్చేందుకు కొడుకుతో కలసి రైలు ఎక్కింది. స్టేషన్ కి 20 కి.మీ దూరంలో ఉన్నపుడు మొబైల్‌కి కాల్ చేసింది. స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకొమ్మని భర్తను కోరింది.
మహిళపై అఘాయిత్యానికి పాల్పడటమేకాకుండా, ఆమెను ట్రయిన్ నుంచి నెట్టివేసి, తానూ దూకిన
సందీప్ (27) అనే నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతనికి గాయాలైయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు పెట్టారు.
అసలు రైళ్లలో ఉండాల్సిన పోలీసులు ఏమైయ్యారు? భద్రతా లోపం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె కోసం పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ట్రాక్ వెంబడి అర్ధరాత్రి వరకు వెతికారు. చీకటిపడటంతో వెతకడం కష్టమైంది. ఈ ఉదయం మృతదేహాం దొరికింది.