iDreamPost
android-app
ios-app

ప్రియుడి కోసం దారుణం.. కర్కశత్వంగా మారిన తల్లి హృదయం

  • Published Oct 31, 2023 | 7:02 PM Updated Updated Oct 31, 2023 | 7:02 PM

రోజు రోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఈ ప్రపంచంలో అన్ని బంధాల్లో కల్లా గొప్పది తల్లి, బిడ్డల ప్రేమ. ఇప్పుడు ఈ రక్త సంబంధం కూడా బీటలు వారుతుంది. అందుకు కారణమౌతున్నాయి వివాహేతర సంబంధాలు.

రోజు రోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఈ ప్రపంచంలో అన్ని బంధాల్లో కల్లా గొప్పది తల్లి, బిడ్డల ప్రేమ. ఇప్పుడు ఈ రక్త సంబంధం కూడా బీటలు వారుతుంది. అందుకు కారణమౌతున్నాయి వివాహేతర సంబంధాలు.

  • Published Oct 31, 2023 | 7:02 PMUpdated Oct 31, 2023 | 7:02 PM
ప్రియుడి కోసం దారుణం.. కర్కశత్వంగా మారిన తల్లి హృదయం

వివాహేతర సంబంధాలు దారుణాతి దారుణమైన చర్యలకు ఒడిగట్టేలా చేస్తున్నాయి. మూడు ముళ్ల బంధానికి తూట్లు పొడిచేసి.. మరొకరితో పడక సుఖం కోసం కట్టుకున్న భాగస్వామిని, కడుపున పుట్టిన బిడ్డలను కడతేర్చుతున్నారు. తమ సంతోషాల కోసం నిచాతినీచంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుటుంబం కూడా అక్రమ సంబంధం కారణంగా వార్తల్లో నిలిచింది. అన్యోన్యంగా కనిపిస్తున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలోకి వచ్చి చేరాడో వ్యక్తి. అతడి కోసం కడుపున పుట్టిన బిడ్డను కడతేర్చింది ఆ ఇంటి ఇల్లాలు. నీటి సంపు నుండి దుర్వాసన వస్తుండటంతో.. చూడగా.. అక్కడ కనిపించిందీ ఆ పిల్లాడి మృతదేహం. కానీ తల్లి జాడ కానరాలేదు.

అయితే నీటిలో ఆడుకుంటూ పడిపోయారని భావించారంతా.. సీసీటీవీ ఫుటే‌లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శృంగవరపు కోటకు చెందిన దొరబాబు.. విశాఖలోని గాజువాక పంతులు గారి మేడ వద్ద అపార్ట్ మెంట్ వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. అక్కడ సెల్లార్‌లో భార్య మణి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 24న భర్తతో గొడవ పడి భార్య వెళ్లిపోయింది. అప్పటి నుండి వీరి చిన్న కుమారుడు వేదాంత్ కనిపించకుండా పోయాడు. తల్లితో వెళ్లి ఉంటాడని తండ్రి భావించాడు. శనివారం అపార్ట్ మెంట్‌లోని నీటి సంపు నుండి దుర్వాసన వస్తుంది. ఎక్కడ నుండి వాసన వస్తుందని వెతకగా.. సంపు నుండని గుర్తించి తీసి చూసేసరికి షాక్ అయ్యారు.

అందులో బాలుడు వేదాంత్ మృతదేహం కనిపించే సరికి తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. తల్లితో వెళ్లిపోయి ఉంటాడని అనుకోగా.. విగత జీవిగా పిల్లవాడ్ని చూసేసరికి ఆవేదన చెందాడు. ఆడుకుంటూ నీటి సంపులో పడిపోయాడని అనుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందులో భరత్తో గొడవ పడిన రాత్రి మణి.. బాలుడ్ని తనతో పాటు తీసుకెళ్లినట్లు కనిపించింది. కొద్ది సేపటికి ఒంటరిగా సంపు వైపు నుండి తిరిగి వచ్చినట్లు రికార్డు అయ్యింది. దీంతో మణిపై అనుమానం కలిగి పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి.. ఆమెను అదుపులోకి తీసుకున్నాయి.

విచారించగా.. కుమారుడ్ని తానే చంపేసినట్లు వెల్లడించింది. ప్రియుడిపై మోజుతో బిడ్డను పొట్టనబెట్టుకున్నట్లు తెలిపింది. మణి తరచూ భర్తతో గొడవపడి హైదరాబాద్ వెళ్లిపోతూ ఉండేది. కాకినాడకు చెందిన పాత గంజాయి నిందితుడు పనస కుమార్ తో రైల్లో ఏర్పడ్డ పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. పసస కుమార్.. ఉప్పల్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భర్తతో గొడవపడిన ప్రతిసారి.. హైదరాబాద్ వచ్చేసి.. ప్రియుడితో కలిసి ఉండేది. అయితే ఇదే సమయంలో తల్లితో వెళ్లిపోయేందుకు కుమారుడు మారం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అందర్ని వదిలేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పడంతో.. తనకు అడ్డుగా ఉన్నాడని బాలుడిని పంపులో పడేసి చంపేసింది తల్లి.. ఆ తర్వాత హైదరాబాద్ చెక్కేసింది. మణితో పాటు ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom