iDreamPost
android-app
ios-app

టీవీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ.. పిల్లల ముందు తిట్టిందని

టీవీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ.. పిల్లల ముందు తిట్టిందని

భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలు అనేకం. అపార్థాలు, అనుమానాలే కాదూ.. పిల్లల చదువులు, ఆర్థిక పరమైన అంశాల్లో కూడా తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వీరి తగాదాలు తారా స్థాయికి చేరి.. విడాకుల వరకు దారి తీస్తుంటాయి. అయితే దంపతుల మధ్య ఘర్షణ జరిగినప్పుడల్లా ఇంట్లో వస్తువుల మీద చూపిస్తుంటారు. ముఖ్యంగా టీవీ రిమోట్, ఇంటి సామాన్లు, ఇతర వస్తువులు పగిలిపోతుంటాయి. కానీ ఓ వస్తువు కారణంగా భార్యా భర్తల మధ్య వివాదం నెలకొని.. చివరకు భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకు ఆ వస్తువు ఏంటంటే టెలివిజన్ (టీవీ). . ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడంబత్తూరు ప్రాంతానికి చెందిన ఆశీర్వాదం, నిషా భార్య భర్తలు. వీరికి నితీష్ కుమార్, కుమార్తె తేజశ్రీ ఉన్నారు.

ఆదివారం టీవీ చూస్తున్న సమయంలో నితీష్ సెల్ ఫోన్ చార్జీంగ్ పెట్టేందుకు టీవీ స్విచ్ ఆప్ చేశాడు. దీంతో తండ్రి కుమారుడ్ని మందలించడంతో పాటు చేయి చేసుకున్నారు. కుమారుడ్ని కొట్టే సరికి తల్లి నిషా అడ్డు చెప్పింది. పదే పదే కుమారుడ్ని కొట్డడంపై భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పిల్లల ముందే భార్య నిషా తిట్టడం భర్త ఆశీర్వాదం తట్టుకోలేకపోయారు. అవమానంగా భావించి.. బంధువల ఇంటికి వెళ్లిపోయాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో నిషా తన పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన ఆశీర్వాదం.. మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు గమనించి, ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య నిషా కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.