iDreamPost
android-app
ios-app

అంతర్జాతీయ క్రికెట్ @ 99 చరిత్ర

అంతర్జాతీయ క్రికెట్ @ 99 చరిత్ర

భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 99 టెస్ట్ మ్యాచులు ఆడి వందో టెస్ట్ కోసం మైదానంలోకి దిగకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్డ్ అయ్యాడు.ప్రస్తుత వన్డే ఆటగాళ్ళలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ టామ్ లాథమ్ 99 మ్యాచ్‌లు ఆడి వందో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక పొట్టి ఫార్మేట్ విషయానికొస్తే పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది సరిగ్గా 99 టీ-20 మ్యాచ్‌లు ఆడి వంద మ్యాచులు పూర్తి చేయకుండానే క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు.మహిళా క్రికెటర్లలో ఇప్పటివరకు భారత మహిళా జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్, న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌త్వైట్ 99 టీ-20 మ్యాచ్‌లను ఆడారు.

టెస్టులలో ఇంగ్లాండ్ బౌలర్ ఆర్థర్ మైలే,ప్రొటీస్ బౌలర్ బెన్ హిల్ఫెన్‌హాస్ మరియు బంగ్లాదేశ్ బౌలర్ అబ్దుర్ రెహ్మాన్ 99 వికెట్లు సాధించి వందో వికెట్ పడగొట్టినకుండానే ముగ్గురు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టారు.వన్డేలలో కివీస్ బౌలర్ స్కాట్ స్టైరిస్ 99 వికెట్లతో రిటైర్ అయ్యారు. ప్రస్తుత ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా మహిళ టీ-20 క్రీడాకారిణి షాబ్నిమ్ ఇస్మాయిల్ 99 వికెట్లతో శతక వికెట్ కోసం ఎదురుచూస్తుంది.

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మేట్‌లు కలిపి 99 పరుగులకే పరిమితమైన ఇన్నింగ్స్‌లు 151.ఇందులో వన్డే మ్యాచ్‌లలో మొత్తం 28 మంది ఆటగాళ్ళు 99 పరుగుల వద్ద ఔట్ అయ్యారు.ఈ జాబితాలో ఇంగ్లాండ్,భారత్ నుండి ఆరుగురు ఆటగాళ్లు,శ్రీలంక, దక్షిణాఫ్రికాకు చెందిన నలుగురు;ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ నుండి ఇద్దరూ; పాకిస్తాన్, వెస్టిండీస్,జింబాబ్వే, ఐర్లాండ్‌కు చెందిన ఒక్కొక్క ప్లేయర్ చొప్పున మొత్తం 28 బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. నర్వస్ నైటీతో ఎక్కువసార్లు 99 పరుగుల వద్ద ఔటైన బ్యాట్స్‌మన్‌ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జాఫ్రీ బాయ్ కాట్ టెస్టులు వన్డే రెండింటిలోనూ అజేయంగా 99 పరుగులు చేసి శతకానికి ఒక పరుగు దూరంలో నిలిచిన తొలి ఆటగాడు.మూడు సార్లు అజేయంగా 99 పరుగులు చేసి శతకాన్ని చేజార్చుకున్న ఏకైక కెప్టెన్ మిస్బా-ఉల్-హక్.