iDreamPost
android-app
ios-app

కామ్రేడ్ సంగీత దర్శకుడికి క్రేజీ ఆఫర్

  • Published Jun 21, 2020 | 7:15 AM Updated Updated Jun 21, 2020 | 7:15 AM
కామ్రేడ్ సంగీత దర్శకుడికి క్రేజీ ఆఫర్

ఇప్పటిదాకా ప్రభాస్ రాధే శ్యామ్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచిన దర్శక నిర్మాతలు ఫైనల్ గా దానికి చెక్ పెట్టినట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ ను ఫిక్స్ చేసినట్టుగా టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కాని త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారట. డియర్ కామ్రేడ్ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే ఆ తర్వాత జస్టిన్ ఇక్కడ వేరే సినిమాలు ఒప్పుకోలేదు. నిజానికి ఈయన కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినవాడు కాదు. 2014లో పన్నైయారుం పద్మినియంతో పరిచయమై ఆ తర్వాత తమిళ్ లోనే ఎక్కువ మూవీస్ చేశాడు. మలయాళంలోనూ ఒకటుంది. నిర్మాణంలో మరొకటుంది.

మంచి క్లాసి మెలోడీ ట్యూన్స్ ఇవ్వడంతో నేర్పరి అయిన జస్టిన్ ప్రభారకన్ రాధే శ్యామ్ ఎలాగూ పీరియాడిక్ లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది కాబట్టి ఫైనల్ గా ఇతన్ని లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్, పాటల రికార్డింగ్ జరుగుతోందా లాంటి వివరాలు ఏవి బయటికి రావడం లేదు. నిజానికి దీనికి ముందు సైరా, నానివి ఫేం అమిత్ త్రివేదిని తీసుకున్నారు. కాని చెప్పిన టైంలో తాను ఇవ్వలేనని నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఇప్పుడా ఛాన్స్ కాస్త జస్టిన్ కు వెళ్లినట్టుగా వినికిడి. తమన్ ను తీసుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్ చేసినప్పటికీ యువి సంస్థ ఎందుకో ఆ ఆలోచన చేయలేదు.

డిఫరెంట్ జానర్ లో పీరియాడిక్ లవ్ స్టొరీగా రూపొందుతున్న రాధే శ్యాం మీద రెండు పోస్టర్లు వచ్చాక అంచనాలు పెరిగాయి. అభిమానులు ఊరట చెందేలా బీట్స్ పేరుతో మరో మోషన్ పోస్టర్ ని 23న వదలబోతున్నారు. ప్రస్తుతం ఇటలీ షెడ్యూల్ జరుపుకుంటున్న ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. కాని కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు అంతరాయం కలగడం ఇప్పటికిప్పుడు క్లారిటీ రావడం కష్టం. బాలన్స్ పార్ట్ కోసం పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాధే శ్యామ్ అధిక శాతం యూరప్ ఇండియా రెండు దేశాల్లో కథ నడుస్తుందని తెలిసింది.