iDreamPost
android-app
ios-app

35 ఏళ్ళ తర్వాత క్రేజీ మల్టీ స్టారర్

  • Published Aug 17, 2020 | 7:34 AM Updated Updated Aug 17, 2020 | 7:34 AM
35 ఏళ్ళ తర్వాత క్రేజీ మల్టీ స్టారర్

తెలుగు ప్రేక్షకులే కాదు దేశం మొత్తం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ అంటే అతిశయోక్తిగా అనిపించినా ఆది వాస్తవం. సౌత్ లో ఇంత క్రేజీ మల్టీ స్టారర్ కొన్ని దశాబ్దాలలో రాలేదన్నది కూడా నిజం. వెంకటేష్ గతంలో పవన్, మహేష్, రామ్ లతో చేసినప్పటికీ అవి పెద్ద రేంజ్ అనిపించుకోలేకపోయాయి.అందుకే రాజమౌళి సినిమా మీద అంత ఆసక్తి. ఇప్పుడు మరో మల్టీ స్టారర్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. సూపర్ స్టార్ రజినికాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని తాలూకు స్క్రిప్ట్ పనులు వేగవంతం అయ్యాయి.

మాస్టర్ రిలీజ్ వాయిదా పడ్డాక లోకేష్ దీని మీదే పూర్తిగా వర్క్ చేస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. బడ్జెట్ కూడా రెండు వందల కోట్ల దాకా పెట్టబోతున్నారని చెన్నై టాక్. అయితే ఏ జానర్ లో రూపొందుతుందనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇది 35 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో. ఇద్దరు కలిసి చివరిసారి కనిపించింది హిందీ మూవీ గిరఫ్తార్ లో. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఉంటారు. అది మరీ బ్లాక్ బస్టర్ కాలేదు. తర్వాత మళ్ళీ కుదరలేదు. అంతకు ముందు వచ్చిన అందమైన అనుభవం, వయసు పిలిచింది లాంటివి తెలుగులోనూ వచ్చాయి.

ఇద్దరూ కలిసి తమిళ్ లో 10 సినిమాలు చేశారు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగాక మాత్రం సాధ్యపడలేదు. కార్తీ ఖైదీతో నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారిన లోకేష్ కనగరాజ్ దీన్ని ఎలా డీల్ చేస్థాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హీరోయిన్లు, ఇతర తారాగణం, టెక్నీకల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇద్దరూ వయసు మళ్ళిన పవర్ ఫుల్ డాన్ తరహా పాత్రల్లో కనిపించనున్నట్టు తెలిసింది. అదే నిజమైతే ఫ్యాన్స్ కి ఏ స్థాయిలో గూస్ బంప్స్ వస్తాయో వేరే చెప్పాలా. మల్టీ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. చెన్నైలో కరోనా పరిస్థితి కుదుటపడగానే దీని ప్రకటన వస్తుంది. కమల్ రజనిల వయసు దృష్ట్యా తొందరపడి మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు లేనట్టే.