iDreamPost
android-app
ios-app

Ram Charan : మెగా పవర్ స్టార్ కోసం క్రేజీ కాంబినేషన్

  • Published Feb 05, 2022 | 10:00 AM Updated Updated Feb 05, 2022 | 10:00 AM
Ram Charan : మెగా పవర్ స్టార్ కోసం క్రేజీ కాంబినేషన్

ఊహించని స్థాయిలో సౌత్ సినిమా డామినేషన్ నార్త్ లో పెరిగిపోతోంది. పుష్ప పార్ట్ 1 వసూళ్లు ఇప్పటికీ అక్కడి ట్రేడ్ కి అంతు చిక్కడం లేదు. మాస్ ఆడియన్స్ ని నిర్లక్ష్యం చేయడం ద్వారా తాము ఏం కోల్పోతున్నామో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మెల్లగా తెలుసుకుంటున్నారు. అర్బన్ కంటెంట్ తో మల్టీ ప్లెక్సులకు ఆదాయం చేకూర్చడం తప్ప సింగల్ స్క్రీన్లకు ఒరుగుతున్నదేమీ లేదని అర్థం చేసుకుంటున్నారు. ఓటిటిలో వచ్చాక కూడా పుష్ప ఒక్క హిందీ వెర్షన్ నుంచే 100 కోట్ల మార్కును అందుకోవడం అంచనాలకు మించిందే. దెబ్బకు పుష్ప 2కి ఓ రేంజ్ లో డిమాండ్ పెరిగిపోయింది. కెజిఎఫ్ బిజినెస్ లెక్కలు మారిపోయాయి.

ఇదంతా ఖచ్చితంగా బాహుబలి నుంచి మొదలైన ప్రభావమే. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మొత్తం ప్రోజెక్టులను లెక్క వేసుకుంటే రెండు వేల కోట్లకు పైగా వ్యాపారం కనిపిస్తోంది. హిందీ నిర్మాతలు నాలుగైదేళ్లకు సరిపడా క్యూలో నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ టార్గెట్ రామ్ చరణ్ వైపు వెళ్తోందని ముంబై టాక్. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేసుకుందన్న వార్త బాగా చక్కర్లు కొడుతోంది. ఈ కాంబినేషన్ అంటే గూస్ బంప్స్ అనే మాట చిన్నదే. జంజీర్ తో గతంలో చేదు అనుభవం ఎదురుకున్న రామ్ చరణ్ కు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పుణ్యమాని ఇమేజ్ అమాంతం మారిపోయింది.

ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే గ్రాండ్ అనౌన్స్ మెంట్ ఇస్తారు. మన స్టార్లతో సినిమాలు తీస్తే దేశవ్యాప్తంగా ఎంతైతే మార్కెట్ అవుతుందో తెలుగు వెర్షన్ కు అంతే వస్తుంది కాబట్టి నిర్మాణ సంస్థలు ఇలా పోటీ పడుతున్నాయి. హిందీలో ఇప్పటి తరం హీరోలు ఎంతసేపూ అల్ట్రా స్టైలిష్ అర్బన్ డ్రామాలే చేస్తున్న నేపథ్యంలో మాస్ సెక్షన్ కోసం సినిమాలు తీసే వాళ్ళు లేకుండా పోయారు. ఈ పరిణామాల వల్ల బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ఛత్రపతి హిందీ రీమేక్ సైతం హాట్ కేక్ లా అమ్ముడుపోయినా ఆశ్చర్యం లేదు. అభిమానులైతే చరణ్ మూవీ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు

Also Read : Sebastian : విధి నిర్వహణలో సెబాస్టియన్ సాహసం