Idream media
Idream media
కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా సీపీఎం దీనిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశాల్లో భవిష్యత్ లో బలోపేతం అయ్యేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు వ్యాఖ్యల్లో కూడా ఈ విషయం స్పష్టమవుతోంది. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన రాఘవులు కీలక విషయాలను వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు.
కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది..
కమ్యూనిస్టుల ప్రభావం ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడివుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకువస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని తట్టుకుని నిలబడుతున్నాం. ఓట్లు ఎరవేసి అధికారం సాధిస్తున్నారన్నారు బీవీ రాఘవులు. లౌకిక వాదానికి బీజేపీ ప్రమాదకరం. రైతు ఉద్యమం ఎన్నో మార్పులు తెచ్చింది. పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది.. అని రాఘవులు సుస్పష్టం చేశారు.
ఆలోచనలు మార్చుకుని ముందుకు సాగుతారట.
రాబోయే రోజుల్లో మేం పుంజుకుంటాంం.గతంలో దుష్ర్పచారాలు చేసి కమ్యూనిస్టు పార్టీలను అణచివేయాలని చూశారు. కానీ ఇప్పుడు మీడియా విస్తారంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. మేం చేసిన తప్పులు జనానికి చెబితే మా విలువ పెరుగుతుంది. మా లోపం గురించి మేం తెలుసుకుంటాం. అందరికీ చెబుతాం. కమ్యూనిస్టులకు ప్రజలు దూరం అవుతున్నారన్నది తెలుసుకుంటున్నాం. మా ఆలోచనను మార్చుకుని ముందుకు సాగుతున్నాం. పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి మాకింకా అలవడలేదు. బస్తీ నుంచి ఢిల్లీ వరకూ డబ్బుల ప్రభావం పెరిగింది. పార్టీలు విరాళాలు భారీగా సేకరిస్తున్నాయి. ఎలక్షన్ బాండ్లకు మేం వ్యతిరేకం. మార్పు వస్తోందని, ఆ బీజాలు కనిపిస్తున్నాయి. బలహీనతల్ని మేం అధిగమిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. మళ్ళీ బలపడుతున్నాం అన్నారు రాఘవులు.
Also Read : కమ్యూనిస్టులతో కేసీఆర్ దోస్తీనా..?! అసోం సీఎం ఘాటు వ్యాఖ్యలు