iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రిగారు… ఎన్నికల్లో డబ్బులు పంచొద్దంటారా?ఇదెక్కడి న్యాయం?..సిపిఐ రామకృష్ణ

  • Published Mar 07, 2020 | 4:06 AM Updated Updated Mar 07, 2020 | 4:06 AM
ముఖ్యమంత్రిగారు… ఎన్నికల్లో డబ్బులు పంచొద్దంటారా?ఇదెక్కడి న్యాయం?..సిపిఐ రామకృష్ణ

వెనకటికి చదువుకున్న వాడు కాకరకాయ అంటే చదువుకొన్న వాడు కీకరకాయ అన్నాడట…

సిపిఐ రామకృష్ణ పరిస్థితి అచ్చు అలాగే ఉంది… అప్పట్లో ఎర్ర కమ్యూనిస్ట్ ఇప్పుడు పచ్చ కమ్యూనిస్ట్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న రామకృష్ణ నిత్యం ప్రభుత్వం మీద ఎదో ఒక ఆరోపణతో వార్తల్లో ఉండటానికి ఆరాటపడుతుంటాడు ….

టీడీపీ చేపడుతున్న వివిధ నిరసన కార్యక్రమాలకు పచ్చ నాయకుల కన్నా ముందే ఈ ఎర్రన్న హాజరవుతూ ఊగిపోతూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నాడు . ఈయన వైఖరితో విసుగు చెందిన సొంత జిల్లా కర్నూల్ సిపిఐ క్యాడర్ ఆ ఆ మధ్య జరిగిన జిల్లా సమావేశంలో రామకృష్ణను నిలదీసింది . ఆ సమావేశంలో పెద్ద గొడవే జరిగింది. నీ కొడుకును టీడీపీలోకి పంపిస్తున్నావా ? 2024 ఎన్నికల్లో నీ కొడుక్కు ఆలూర్ లేదా గుంతకల్ టీడీపీ టికెట్ సాధించటానికి చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నావా అని సిపిఐ క్యాడర్ రామకృష్ణను ప్రశ్నించింది.

ఈ నెలలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రామకృష్ణ ద్వారా కమ్యూనిస్టులతో పొత్తుకు ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సిపిఎం మాత్రం టీడీపీతో కలవకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సిపిఐ లో కూడా ఇతర నాయకులకు టీడీపీతో కలవటం ఇష్టం లేకపోయినా కార్యదర్శిగా రామకృష్ణ మాత్రం టీడీపీతో పొత్తుకు ఆరాటపడుతున్నాడు.

ఇప్పటి విషయానికి వస్తే , స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు పంఫిణీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

ఈ ఆర్డినెన్సు మీద ముఖ్యమంత్రి జగన్ గట్టి హెచ్చరికలు కూడా చేశాడు … ఏ పార్టీ వాళ్లయినా డబ్బు, మద్యం పంఫిణీ చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక చేశాడు .

ఇలాంటి ఆర్డినెన్సు మీద కొందరు హర్షం వ్యక్తం చేయొచ్చు , మరికొందరు ఎన్ని చట్టాలు చేసినా ఎన్నికల్లో డబ్బు, మద్యం పంఫిణీ ఆగుతుందా అని పెదవి విరచవచ్చు . కానీ సిపిఐ రామకృష్ణను మాత్రం ఈ ఆర్డినెస్ భయపెడుతుందట. డబ్బు పంపిణీ చేస్తే మూడేళ్ల జైలుకు పంపుతామనటం ప్రతిపక్షాలను బెదిరించటమేనట! ఈ బెదిరింపుల్లో సొంత పార్టీ నేతలకు కూడా మినహాయింపు లేకుండా పోయిందని రామకృష్ణ బాధపడుతున్నాడు…

రామకృష్ణ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంఫిణీ చేసే అవకాశం విపక్షాలతో పాటు అధికారపక్షానికి కూడా ఇవ్వాలని జగన్ను డిమాండ్ చేస్తున్నట్లుంది. దినాము పొద్దు పొడిచేదే ప్రభుత్వాన్ని విమర్శించటానికి అన్నట్లు పరిస్థితి తయారైంది.. అందుకే ఏమి మాట్లాడుతున్నామో ఏమి విమర్శ చేస్తున్నామో అన్న సృహ లేకుండా ఎదో ఒక విమర్శ చెయ్యటం రామకృష్ణకు అలవాటయ్యింది.

రామకృష్ణ వైఖరితో కమ్యూనిస్టులు ప్రజలలో చులకన కావటం తప్ప సిపిఐ కి ఒనగూరుతున్న ప్రయోజనం ఏమి లేదు . సిపిఐ కూడా ఆత్మపరిశీలన చేసుకొని పచ్చ పందిళ్లు వదిలి స్వీయ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటే మంచింది.