Idream media
Idream media
కార్మికులకు అన్యాయం జరుగుతుందంటే.. అక్కడ కమ్యూనిస్టు నాయకులు ప్రత్యక్ష్యమవుతారు.. కార్మికులు కూడా వారి రాక కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే గట్టిగా మాట్లాడేతనం, నినదించే గుణం, పోరాట పటిమ వారికి కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో కూడా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసగా కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినదిస్తున్నాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరో ముందడుగు వేసి 100 శాతం పెట్టుబడులకు సంబందించి కేంద్ర ప్రభుత్వం బిడ్స్ ను ఆహ్వనించింది. దీంతో ఆగ్రహజ్వాలలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో కార్మికులకు సంఘీభావంగా అక్కడకు వెళ్లిన సీపీఐ నారాయణకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి జగన్ ను నిందిస్తూ మాట్లాడుతుండడంతో కార్మిక సంఘాల నేతలు అడ్డు తగిలారు. దీంతో సీపీఐ నారాయణకు ఒక పట్టాన ఏమీ అర్థం కాలేదు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఓ ముఖ్యమంత్రిని నిందిస్తూ మాట్లాడుతుంటే.. సాధారణంగా చప్పట్లు వినిపించాల్సిన చోట ఇలా జరగడం ఏంటా అని ఆశ్చర్యపోవడం నారాయణ వంతైంది.
కార్మికుల ఉద్యమానికి మద్దతుగా స్టీల్ ప్లాంట్ దగ్గర కు వెళ్లిన నారాయణ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నారాయణ చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాల నేతలు ఖండించారు. నారాయణ ప్రసంగానికి కార్మిక సంఘాల నేతలు అడ్డుతగిలారు. స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని సూచించారు. ఇప్పటికే సీఎం రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని కార్మి సంఘాలు గుర్తు చేశాయి. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని కార్మిక సంఘాల నేతలు అన్నారు.
సిపిఐ నారాయణ మాట్లాడుతూ .. సీఎం మోదీకి రాసే ప్రేమలేఖల వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. సీఎం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ వద్ద శిబిరానికి రావాలని..ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరగాలని అన్నారు. అన్నీ ఆదానికి అంబానీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని సంపదను అమ్మేస్తున్నారని విమర్శలు చేశారు. విశాఖకు అన్యాయం జరుగుతుంటే కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. విశాఖకు స్టీల్ ప్లాంట్కు న్యాయం జరిగే వరకు.. మిజోరాం గవర్నర్గా వెళ్లనని హరిబాబు చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆపగలరని తెలిపారు.
ఇదిలా ఉంటే, విశాఖలో ఒక వైపు ఉక్కు కార్మికులు తమ సంస్థ ప్రైవేట్ కాబోతోంది అని మండిపోతున్నారు. అందుకు కారణం కేంద్రం. నిందిస్తే కేంద్రాన్ని నిందించాలి. డిమాండ్ చేస్తే అక్కడ డిమాండ్ చేయాలి. కానీ చిత్రంగా నారాయణ ఏపీ సర్కార్ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దాంతో ఉక్కు కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగానే ఖండించాయి. తమకు అందరి మద్దతూ కావాలి. తమ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతుగా ఉన్న వైసీపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి రాజకీయం చేద్దామనుకుంటే ఇక్కడ అసలు కుదరదు అని కచ్చితంగా చెప్పేశారు.