విపత్తు సమయంలో అండగా నిలవాల్సిన ఫార్మా సంస్థలు వ్యాపార ధోరణికి బాగా అలవాటు పడ్డాయి. ప్రజలందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు ఇచ్చి, ఈ దారుణమైన పరిస్థితి నుంచి బయటకు వేయాల్సిన ప్రభుత్వాలు సైతం ఫార్మా కంపెనీలు చెబుతున్న టీకా ధరలకు బేరాలు ఆడుతూ కాలం గడుపుతున్నాయి. ఫలితంగా కరోనా బారినపడి వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
భారత్లో కోవి షిల్డ్ తోపాటు కొవాక్జిన్ టీకాకు అనుమతులు లభించాయి. దేశంలో అందరికీ ఈ రెండు రకాల్లో ఏదో ఒకటి వేస్తున్నారు. కోవిషిల్డ్ ను విదేశాల్లో అభివృద్ధి చేస్తే కోవాక్సిన్ ను స్వదేశంలోనే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. అయితే ఏ వాక్సిన్ అయినా ఫార్ములాను తీసుకొని పూణేలోనిసీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారు చేస్తారు. దాదాపు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే టీకాలో సగం పైగా ఇండియాలోనే ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ బలంగా ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన ఫార్మా సంస్థలు, టీకా ఉత్పత్తి చేసే సంస్థలు ఇంకా వ్యాపార ధోరణితో బేరాలు ఆడటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
తాజాగా కోవిషిల్డ్ ధరను తగ్గిస్తూ సీరం సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు అందిస్తున్న డోసు 400 ధర నుంచి 300 కు తగ్గిస్తూ గురువారం సీరం ఇనిస్ట్యూట్ సీఈవో అదర్ పూనేవలా ట్విట్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు మాత్రం 600 ధర తోనే టీకాను అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రానికి 150 రూపాయల ధరతో నే ఒక డోస్ ఇస్తామని గతంలోనే ప్రకటించిన తీరం అదే ధరకు కట్టుబడి ఉంది. అయితే విపత్తు వేళ ఇప్పుడు ఈ ధరల్లో హెచ్చుతగ్గులు సగటు భారతీయుడికి అయోమయానికి గురిచేస్తున్నాయి.
Also Read : లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?
మరో పక్క భారత్ బయోటెక్ తయారు చేసిన కో వ్యాక్సిన్ ధర మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 600 రూపాయల ధర దగ్గర నుంచి 1200 వరకు అమ్మకానికి పెట్టిన కో వ్యాక్సిన్ దానిలో ఎలాంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేసింది. గతంలో మినరల్ వాటర్ బాటిల్ ధరకే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి భారత ప్రజలకు అందిస్తామని చెప్పిన భారత్ బయోటెక్ ఆ మాట తప్పి నట్లయింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా జోరుగా ట్రోలింగ్ జరుగుతోంది. విపత్తు సమయంలో ఫార్మా కంపెనీలు కనీసం ఎలాంటి మానవతను చూపించకుండా ఇష్టానుసారం ధరలను పెంచడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోపక్క ఇప్పటికే వ్యాక్సిన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు చేయాలని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిన కేంద్రం ప్రజల వద్ద నుంచి భారీగా విమర్శలు రావడంతో టీకాలను తాము కొని, రాష్ట్రాలకు ఇస్తామని కొత్త పల్లవి అందుకుంది.
కేసులు భారీగా పెరగడంతో పాటు ప్రజల్లో కరోనా భయం ఎక్కువ కావడంతో టీకాలు వేసుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. అయితే తగిన మోతాదులో టీక లభ్యత లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో కొరత తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 45 ఏళ్లు పైబడిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే కొరత కారణంగా రాష్ట్రంలో ఇంకా ఇది ఊపందు కోలేదు. దీనిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.
Also Read : టీకా ఎంచుకునే అవకాశం.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు