Idream media
Idream media
మొదటి, రెండో దశల్లో ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరినైతే మహమ్మారి కాటేసింది. ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు. దేశాల ప్రధానుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఈ కరోనా బారిన పడి అవస్థలు పడ్డవారు.. ఇందులో సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. చాలా మంది ప్రముఖులు కరోనాను ఎదుర్కోలేక అసువులు బాసిన వారే. చాలా మంది దీన్ని ఎదుర్కొని నిలిచిన వారు కూడా ఉన్నారు.
తాజాగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే (65) కోవిడ్ బారినపడ్డారు. ఈయన గతంలోనూ వైర్స్ కు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కుటుంబంలో ఒకరికి వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఐసొలేషన్లోకి వెళ్లారు. ఇక సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం (49) ఆయన భార్య ప్రియా రాంచల్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సినీ టీవీ నిర్మాత ఏక్తా కపూర్(46) వైర్స్ కు గురయ్యారు. బాలీవుడ్ ప్రసిద్ధ నటుడు ప్రేమ్ చోప్రా(86) ఆయన భార్య ఉమా చోప్రాలకు కరోనా సోకింది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహించే ప్రజాదర్బార్లో పాల్గొన్న 14 మందికి వైరస్ సోకింది. రాష్ట్ర మాజీ సీఎం జీతన్ రామ్ మాంజీ (77) ఆయన ఇంట్లో 18 మందికి పాజిటివ్గా తేలింది. ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 38 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వైరస్ బారినపడ్డారు. బాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. కరీనాకపూర్ నోరా ఫతేహి కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో పాటు ఆయన సతీమణి ప్రియా రాంచల్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కరోనాసోకింది. తనకు సన్నిహితంగా ఉన్న వారు పరీక్షలు చేసుకోవాలని ఆమె కోరింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండోసారి కరోనాను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. ఇలా కరోనా బారిన పడుతున్న సినీ, రాజకీయ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. మహారాష్ట్రలో అయితే ఒకేసారి యాభై మంది ఎమ్మెల్యేలు, పది మంది మంత్రులపైనా కోవిడ్ పంజా విసిరింది.
Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?