iDreamPost
android-app
ios-app

మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతం.. కార్పొరేటర్‌ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం

మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతం.. కార్పొరేటర్‌ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం

మేక్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) విధానానికి మరింత ఊపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేలా కార్పొరేటర్‌ పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన కార్పొరేట్‌ ట్యాక్సును వెల్లడించారు.

ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో ఇటీవల కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదే విధంగా ఈ కంపెనీలు నూతన యూనిట్లు ప్రారంభించినా 22 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 15 శాతం మాత్రమే విధిస్తామని మంత్రి ప్రకటించారు. తద్వారా నూతన కంపెనీల ఏర్పాటుకు ఊతం ఇచ్చారు.

15 శాతం కార్పొరేటర్‌ పన్ను అనేది ప్రపంచంలోనే తక్కువైనదని మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడం విదేశీ సంస్థలను ఆకర్షించేందుకే ఈ విధానం ప్రకటించారని అర్థమవుతోంది. తక్కువ పన్ను ఉండడం వల్ల విదేశీ పెట్టుబడిదారులతోపాటు దేశీయ పెట్టుబడిదారులు నూతన యూనిట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.