iDreamPost
iDreamPost
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు ఒకే నిర్మాత వందల కోట్ల బడ్జెట్ ని మోసే పరిస్థితి లేదు. ఇంకొకరి సహాయం కావాల్సిందే. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఆర్ సి 15(ఇంకా టైటిల్ నిర్ణయించలేదు)కు నిర్మాత దిల్ రాజు అన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఇందులో కో ప్రొడక్షన్ హౌస్ గా జీ స్టూడియోస్ జాయినయ్యింది. పెట్టుబడిలో భారీ మొత్తాన్ని పెట్టడంతో పాటు ఈ సినిమా తాలూకు డిజిటల్ కం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా ఈ డీల్ ఉభయకుశలోపరిగా నిలవనుంది. ఈ కొలాబరేషన్ ని అధికారికంగా ప్రకటించలేదు కానీ అంతర్గతంగా అగ్రిమెంట్లు గట్రా జరిగిపోయినట్టు సమాచారం. త్వరలో అఫీషియల్ కావొచ్చు.
జీ సంస్థ ఇటీవలి కాలంలో నిర్మాణంలో ఉన్న సినిమాల తాలూకు ఒప్పందాల్లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రిపబ్లిక్ ని ఇదే తరహాలో రిలీజ్ చేసింది కానీ దానికి తగ్గ ఫలితం దక్కలేదు. అంతకు ముందు సోలో బ్రతుకే సో బెటరూ సేఫ్ ప్రాజెక్ అయ్యింది. నాగార్జున చేస్తున్న బంగార్రాజులోనూ జీ ప్రొడక్షన్ పార్ట్నర్ గా ఉంది. అందుకే జనవరిలోనే రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు నాగార్జున. ఇప్పుడు రామ్ చరణ్ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం ద్వారా జీ తన ప్రణాళికలను విస్తరిస్తోంది. ఎంత ఇన్వెస్ట్ మెంట్ అనేది బయటికి రాలేదు. నార్త్ లోనూ ఇదే తరహా స్ట్రాటజీని సల్మాన్ ఖాన్ రాధేతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే
రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఇదే తరహాలో అక్షయ్ కుమార్ రామ్ సేతులో భాగమయ్యింది. నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ప్రత్యేకంగా తన ప్లాట్ ఫార్మ్ కోసమే సినిమాను నిర్మింపజేస్తోంది.హాట్ స్టార్ వెబ్ సిరీస్ లతో పాటు చిత్రాల మీద కూడా ఫోకస్ పెంచుతోంది. థియేటర్ ప్లస్ డిజిటల్ అనే సూత్రంలో ఇవి అనుసరిస్తున్న ఎత్తుగడలు క్రమంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్ లను సైతం థియేటర్ అని పట్టుబట్టకుండా రాజీ పడేలా చేయడం ఖాయం. యాష్ రాజ్ సంస్థ కేవలం ఓటిటి నిర్మాణల కోసమే అయిదు వందల కోట్లు కేటాయించడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. మార్పు తప్పదు మరి
Also Read : Oka Chinna Family Story : ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిపోర్ట్