iDreamPost
iDreamPost
తెలంగాణలో రోజు రోజుగు కరోనా మహమ్మారి విజృభిస్తోంది. చిన్నా,పెద్దా – పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రజలందరి పైన అత్యంత వేగంగా దాడి చేస్తంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 164 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది చనిపోయారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,484కు చేరుకోగా చనిపోయిన వారి సంఖ్య 174కు పెరిగింది. ఇక రాష్ట్రంలో 2032 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు తెలంగాణలో సామాన్యులు అధికారులు వరకే ఈ వైరస్ సోకినా మొట్టమొదటిసారి అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధికి కూడా ఈ వైరస్ అంటుకుంది . టీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా వైరస్ అనుమానంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణలో కరోనా సోకిన తొలి శాసనసభ్యుడిగా ముత్తి రెడ్డి, హైదరాబాద్ లో క్వారంటైన్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. గతంలో ముత్తిరెడ్డి కరోనా ను ఎదుర్కోవాడిడానికి తన వంతు సహయం గా తన రెండు నెలల జీతం 5 లక్షలు ముఖ్యమంత్రి సహయ నిధికి ఇవ్వడం గమనార్హం .