iDreamPost
android-app
ios-app

దేశంలో కరోనా @ 125

దేశంలో కరోనా @ 125

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు 1,82,000 కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. 7,171 మంది ఈ ప్రమాదకర వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.

ఇప్పటివరకూ మనదేశంలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదు కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన నగరమైన నాగ్ పూర్ లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగా ఉండకూడదని, తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ ప్రజా రవాణాని స్థంభింపజేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని తగ్గించాలంటే ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.

పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాయి. దీంతో ఆయా కంపెనీల ఉద్యోగులు ఇంటినుండి తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నమోదయిన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. కేరళ 22,హర్యానా 14, మహారాష్ట్ర 39,ఉత్తరప్రదేశ్ 12,కర్ణాటక 8,ఢిల్లీ 7,లడఖ్ 4,తెలంగాణ 4,రాజస్థాన్ 2,ఆంధ్రప్రదేశ్ 1,తమిళనాడులో ఒకరికి ఈ వైరస్ సోకింది ..

ప్రస్తుతం భారతదేశంలో కరోనా రెండో దశలో ఉందని అదే మూడో దశకు చేరుకుంటే కరోనా వైరస్ ను కట్టడి చేయడం కష్టతరం అవుతుందని, ముందస్తుగా ప్రభుత్వం కఠిన చర్యలు అమలుచేస్తుంది. అందులో భాగంగానే, అనేక విద్యా సంస్థలు, థియేటర్లను, షాపింగ్ మాల్స్ ను మూసి వేయాలని ప్రభత్వాలు నిర్ణయించాయి. కరోనా కారణంగా అనేక క్రీడా పోటీలను రద్దు చేసారు. ఐపీఎల్ ను వాయిదా వేశారు.