వైరస్ కు అడ్డేది : రెట్టింపు కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకి వైరస్ బారినపడే వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. నిన్న 24 గంటల్లో 354 మందికి వైరస్ సోకగా.. నేడు 773 మందికి ఈ మహమ్మారి అంటుకుంది. మొత్తం మీద దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,194 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఈ రోజు కరోనా సోకిన వారిలో 32 మంది చనిపోయారు. దీనితో దేశంలో కరోనా మరణాలు 149 కి చేరాయి. కరోనా సోకినా చికిత్స తర్వాత 402 మంది కోలుకున్నారు. వీరిని ఆస్పతుల నుంచి వారి ఇళ్లకు పంపించారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం పై ఓకింత ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. పరిస్థితి ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఔషధాల కొరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ తో పాటు 24 రకాల ఔషధాల ఎగుమతుల పై విధించిన నిషేధాన్ని నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. ఈ నేపథ్యంలో లవ్ అగర్వాల్ ఔషధాల నిల్వ పై క్లారిటీ ఇచ్చారు. దేశంలో హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందుకు కొరత లేదని స్పష్టం చేశారు. 

Show comments