iDreamPost
android-app
ios-app

భారీగా తగ్గిన కోవిడ్‌ పాజిటివ్‌లు

  • Published Nov 24, 2020 | 3:04 AM Updated Updated Nov 24, 2020 | 3:04 AM
భారీగా తగ్గిన కోవిడ్‌ పాజిటివ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాదాపు రెండు నెలల పాటుపదివేలకు పైగా నమోదవుతూ కలకలం రేపిన పాజిటివ్‌లు ఇప్పుడు 545కు తగ్గిపోయాయి. గడచిన 24 గంటల్లో 47,130 శాంపిల్స్‌ పరీక్షించగా 545 పాజిటివ్‌లు తేలాయి. అలాగే 1,390 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని చికిత్సా కేంద్రాల నుంచి ఇంటికి చేరుకున్నారు. కాగా 10 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఏపీలో 13,394 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

కాగా గుంటూరులో 117, తూర్పుగోదావరిలో 104, పశ్చిమగోదావరిలో 76, కృష్ణాలో 44, చిత్తూరులో 32, కడపలో 31, నెల్లూరులో 30, ప్రకాశం జిల్లాలో 25, విశాఖలో 21,అనంతపురంలో 19, విజయనగరంలో 17, కర్నూలులో 10 పాజిటివ్‌లు గుర్తించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో స్పష్టం చేసింది.