iDreamPost
android-app
ios-app

లక్షా పన్నెండువేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

లక్షా పన్నెండువేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 5609 పాజిటివ్ కేసుల నిర్దారణ

దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. మొదట్లో వందల్లో నమోదైన కేసులు కాస్త నేడు రోజుకి దాదాపు ఆరువేల పాజిటివ్ కేసులుగా నిన్న ఒక్కరోజులో 5609 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359 కు చేరింది. కాగా కరోనా కారణంగా 3435 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 132 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 45,300మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 63,624 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2161 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2161 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 39,297 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 75 మంది మహారాష్ట్రలో మృత్యువాతపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1390 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 24,118 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. గడచిన 24 గంటల్లో 1371 కరోనా పాజిటివ్ కేసులు ముంబయిలో నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 841 గా నమోదయింది.

తెలంగాణలో నిన్న కొత్తగా  27 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 1661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 610 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1013 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 38 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 45 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2452 కి మందికి కరోనా సోకగా 53 మంది మృత్యువాత పడ్డారు.1,680 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 718 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5,090,064 మందికి కోవిడ్ 19 సోకగా 329,732 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,024,231 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,593,039 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 94,941 మంది మరణించారు.

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş