iDreamPost
android-app
ios-app

రెండు లక్షలకి చేరువలో కరోనా కేసులు

రెండు లక్షలకి చేరువలో కరోనా కేసులు

ఒక్కరోజులో 8171 పాజిటివ్ కేసులు-204 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది.  కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8171 కేసులు, 204 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,98,706 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 5,598 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో 7 వ స్థానానికి భారత్ చేరింది. కరోనా వైరస్ బారినుండి 95,526 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 97,581 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2358 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2358 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 70013 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 2362 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 41,099 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1319 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 94 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 2792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1213 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1491 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 82 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 105  కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 3676 మందికి కరోనా సోకగా 64 మంది మృత్యువాత పడ్డారు. 2374 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,238యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 6,371,746 మందికి కోవిడ్ 19 సోకగా 377,558 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,904,995 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,859,323 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 106,925 మంది మరణించారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom