Idream media
Idream media
కరోన వైరస్ విషయంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలో ఈ సంఘటన చాటిచెబుతోంది. ఒకరికి కరోనా వస్తే.. ఆ ప్రాంతంలోని 54 వేల మంది సెల్ఫ్ క్వారంటైన్(స్వియ నిర్బంధం)లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ స్థాయిలో కరోన వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరిగింది కాదు.. మన దేశంలోనే చోటుచేసుకుంది. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది.
గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని ఓ ప్రాంతంలో లాండ్రీ నడిపే ఓ 67 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో ఉండే 16,785 నివాసాలలోని 54,003 మందిని అధికారులు అప్రమత్తం చేశారు. వారందరినీ 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి పంపారు. కాగా, ఇప్పటి వరకు గుజరాత్‌లో 95 కేసులు నమోదయ్యాయి. ఇంకా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
కరోన వైరస్ అంటే లెక్క చేయకుండా లాక్‌డౌన్‌లోనూ బయటకు వచ్చే వారు ఈ ఘటనను చూసైనా వారి ప్రవర్తన మార్చుకోవాలి. ఒకరికి పాజిటివ్ వస్తే… ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఏ స్థాయిలో జాగ్రత్తగా ఉన్నారో సూరత్ ఘటన తెలియజేస్తోంది. ప్రజలందరూ తమకు తాము ఇళ్ల నుంచి బయటకు రాకండా స్వియ నిర్బంధించుకోవడం అభినందనీయం. మన ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి రావడం దురదృష్ఖకరం. తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను భేఖాతర్ చేస్తున్న వారు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలి.