Idream media
Idream media
కరోనా ప్రభావం ఉద్యోగాలపై మొదలైంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కత్తి వేలాడుతోంది. ఈ ఏప్రిల్‌లోనే వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలిసింది. మార్చి నెల జీతం అకౌంట్‌లో వేసిన తర్వాత ఈ మెయిల్‌లో ప్రస్తుతానికి నీ ప్రాజెక్ట్ పూర్తి అయింది. తర్వాత ప్రాజెక్ట్ వచ్చే వరకు మీ సేవలు అవసరం లేదని చెప్పేశారు.
చాలా కంపెనీలకు అమెరికా ముడి ఉన్నందున , అక్కడి కంపెనీలు ఇబ్బందుల్లో ఉండి ప్రాజెక్టులు ఆపేస్తున్నాయి. దాని ప్రభావం ఇది. ఐదో తేదీకి ఈ పరిస్థితి ఉంటే నెలాఖరుకు ఇంకా ఎందరి ఉద్యోగాలు పోతాయో తెలియదు.
కరోనాతో దినపత్రికలు కష్టాల్లో పడ్డాయి. తెలుగులో మూడు ప్రధాన పత్రికల్లో కనీసం 200 మందికి పైగా సిబ్బందిని తగ్గిస్తున్నారు. దీనికి కసరత్తు మొదలైంది. ఫెర్‌ఫార్మెన్స్ రిపోర్ట్‌లు అడుగుతున్నారు. జర్నలిస్టులపైన్నే కాదు, యాడ్స్, సర్క్యులేషన్ సిబ్బందిపై కూడా ఈ కత్తి వేలాడుతూ ఉంది.
వస్త్ర దుకాణాలు , బంగారు షాపుల్లో కూడా సిబ్బందిని లాక్‌డౌన్ తర్వాత తగ్గిస్తున్నారు. స్విగ్గి, జొమాటోలు కూడా భారీగా ఆర్డర్లు కోల్పోవచ్చు. అదే జరిగితే దాని ప్రభావం రెస్టారెంట్లపై ఉంటుంది.
కరోనా దేశం మొత్తాన్ని దెబ్బ కొడుతూ ఉంది. అందరి కంటే ఎక్కువగా రియల్టర్లు భయపడుతున్నారు. వెంచర్ల మీద పెట్టిన భారీ పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం కనపడడం లేదు.
ఇదిలా ఉంటే EMI ల పద్ధతిలో ఇళ్లు కొన్న వాళ్లు టెన్షన్ పడుతున్నారు. కరోనా ఆర్థిక సమస్యలే కాదు, సామాజిక సమస్యల్ని కూడా తెస్తుంది. విడాకులు పెరుగుతాయి. నేరాలు పెరుగుతాయి.