iDreamPost
iDreamPost
ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు సుమారు లక్షమందికి పైగా బలైపోయారు. మొదట్లో వైరస్ ను తేలిగ్గా తీసుకున్న చాలా దేశాల్లోనే బాధితులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొత్తం బాధితుల సంఖ్య 17 లక్షల దిశగా వేగంగా వెళుతోంది. అలాగే మృతుల సంఖ్య కూడా 1,01,482కి చేరుకోవటం గమనార్హం. మామూలుగా ప్రకృతి వైపరీత్యాలకు కూడా లక్షమంది మరణించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవనే అనుకోవాలి.
బాధితుల్లో ఎక్కువగా అంటే అమెరికాలో 5 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా చనిపోయిన వారు మాత్రం ఇటలీలో ఎక్కువగా 18, 849 మందిగా రికార్డయ్యింది. తర్వాత అమెరికాలో సుమారు 18 వేలు మంది చనిపోతే స్పెయిన్ లో 16 మంది మృతిచెందారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ముందుగా యూరోపు దేశాలైన ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ తో పాటు ఇరాన్ మీద ప్రభావం చూపింది. అక్కడి నుండి మెల్లిగా అమెరికాకు పాకింది. ప్రపంచంలో ఏదేశం మీద కరోనా ప్రభావం పడినా అందులో దాదాపు చైనా వాళ్ళ వల్లే అన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇటలీలోను, స్పెయిన్, జర్మనీతో పాటు అమెరికాలో కూడా చైనా వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి మొదలైంది. వైరస్ వ్యాప్తని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే పై దేశాల్లో విపరీతంగా పాకిపోయింది. చివరకు ఈ వైరస్ ఒక దేశం నుండి మరో దేశానికి పాకిపోయి మొత్తం ప్రపంచాన్నే ఇపుడు వణికించేస్తోంది. కాస్త అటు ఇటుగా ప్రపంచంలోని చాలా దేశాలు చాలా రోజులుగా లాక్ డౌన్ పాటిస్తున్నాయంటనే వైరస్ దెబ్బంటో అందరికీ తెలిసిపోతోంది.
వైరస్ ప్రభావం ఎప్పుడు అంతమవుతుందేమో కానీ యావత్ ప్రపంచం అల్లలాడిపోతోంది. మందులు లేని శతృవు అవ్వటంతో అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా కూడా వైరస్ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో రాబోయే రెండు వారాలు చాలా కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు శాస్త్రజ్ఞులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళుగా స్వీయ నిర్బంధంలోకి ఉంటే కానీ వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవటం సాధ్యం కాదనే అనుకోవాలి. లేకపోతే వైరస్ ప్రభావం ఏ స్ధాయికి వెళుతుందో ఊహించటానికి కూడా భయంగానే ఉంది.