iDreamPost
android-app
ios-app

ఏపీలో 299 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో 299 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 299  మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,496కి కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  వెల్లడించింది. కాగా 2,983  మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 2,779 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 92 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో 77 మంది కోవిడ్19 నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 13,923 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 275 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కాగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన 126 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దానితో మొత్తం కేసులు 425 మందికి కరోనా సోకినట్లు నిర్దారణ  అయ్యింది.