ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది.. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7727 శాంపిల్స్ పరీక్షించగా 73 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1332 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా 287 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 1014 గా నమోదయింది.
గడచిన 24 గంటల్లో 29 మంది కరోనా బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు నుండి 20 మంది అత్యధికంగా డిశ్చార్జ్ కాగా అనంతపురం, కృష్ణా, నెల్లూరు నుండి ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 మంది మరణించారు.
అత్యధికంగా గుంటూరులో 29 మందికి వైరస్ నిర్దారణ కాగా,కృష్ణాలో 13,కర్నూల్ లో 11 మందికి కోవిడ్ 19 నిర్దారణ అయింది. కాగా కోవిడ్ ఆసుపత్రులలో పనిచేయడానికి 1170 మంది డాక్టర్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..