ఈ మధ్యకాలంలో ఫాస్ట్ పుడ్ తిన్నేవారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఫాస్ట్ పుడ్ తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆస్తకి చూపిస్తున్నారు. అందుకే ఈ ఫాస్ట్ ఫుడ్ తయారీ సెంటర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. కొన్ని దుకాణాల్లో నాణ్యత లేని వంట నూనె, ఇతర పదార్థాలతో ఈ చైనీస్ ఫుడ్ ను తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ విషయం చెప్తే.. మీరు జన్మలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లారు. కొన్ని ఫాస్ట్ ఫుడ్ దుకాణాల్లో పంది కొవ్వుతో చేసిన వంట నూనెను వినియోగిస్తున్నారు. పంది కొవ్వుతో నూనె తయారుచేసి ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయిస్తున్న కేటుగాణ్ని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో రమేశ్ శివ (24) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా తన నివాసంలో పంది కొవ్వుతో వంట నూనెను తయారు చేస్తున్నాడు. పంది మాంసం విక్రయించే దుకాణాల నుంచి పంది కొవ్వు సేకరిస్తాడు. పంది కొవ్వును వేడి చేసి.. వివిధ రసాయనాలు కలుపుతూ నూనెలు తయారు చేసే వాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ దుకాణాలు నిర్వహించే వారికి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఇలా కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా పనిని చేస్తున్నాడు. అయితే దీనికి గురించి మాల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులకు పక్క సమాచారం అందింది.
బుధవారం నిందితుడి నివాసంలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించగా, పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు బయట పడింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న వారిపైనా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ విషయం తెలిసిన ఫాస్ట్ ఫుడ్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి నగరంలో ఇంకా ఎన్ని ఉన్నాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలానే ఇప్పటి వరకు పంది కొవ్వుతో చేసిన నూనెను వినియోగించిన ఫాస్ట్ పుడ్ తిన్నామా? అని స్థానికులు కొందరు ఆందోళన వ్యక్తం మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.