iDreamPost
android-app
ios-app

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన MLA జగ్గారెడ్డి!

  • Published Oct 25, 2023 | 8:00 PM Updated Updated Oct 25, 2023 | 8:00 PM

తెలంగాణలో ఎన్నికల డేట్ దగ్గరపడుతుంది.. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు.

తెలంగాణలో ఎన్నికల డేట్ దగ్గరపడుతుంది.. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు.

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన MLA జగ్గారెడ్డి!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్నాయి. దీంతో రాజకీలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఏ క్షణంలో ఎవరు పార్టీ మారుతారో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే సీనియర్ నేతలు కొంతమంది అధికార పార్టీ బీఆర్ఎస్ కండువ కప్పుకుంటున్నారు. తాజాగా బీజేపీకి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రజలు అధికారం మారాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ పాలన చూశాం.. ఇక మరొకరికి అవకాశం ఇద్దాం అని ఆలోచనలో ఉన్నారని ఆయన అన్నారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణకు బూస్ట్ లా మారింది. టీపీసీపీ చీఫ్ రెవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్ల భట్టివిక్రమార్క లాంటి నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది అధిష్టానం మాత్రమే ఫైనల్ చేస్తుందని అన్నారు.

విజయదశమి సందర్భంగా నా మనసులో మాట చెబుతున్నా.. ఇంకా పదేళ్లకైనా నేను సీఎం అవుతాను, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ చేశారు.. చైర్మన్ చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. వచ్చే పదేళ్లలో ఒక్కసారైనా నేను సీఎం అవుతానన్న ఆశ నాకు ఉంది..  ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు. ఎన్నికల కోడ్ ఉంది.. అందుకే నోరు, చేతులు కట్టేశారు, లేకుంటే నా మనసులో మరిన్ని విషయాలు మీతో పంచుకునేవాన్ని అని అన్నారు. తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అక్కడికి వాలిపోతాను అని అన్నారు. ఇప్పటికే సీఎం రేసులో అభ్యర్థుల జాబితా పెరిగిపోతుంటే.. జగ్గారెడ్డి వాఖ్యలు కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.