చంద్రబాబు గురివింద నీతికి ఇంతకన్నా నిదర్శనం కావాలా ?

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటం అన్నది ఇపుడు ప్రధాన సమస్యగా మారిపోయింది. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయటాన్ని టిడిపి తీవ్రంగా ఆక్షేపించి కోర్టులో కేసు వేసింది. ఇక్కడ కోర్టు ఏమని తీర్పు చెప్పిందన్నది ప్రధానం కాదు. అయితే తాము అధికారంలో ఉన్నపుడు ఏమి చేశామన్నది ప్రధానం.

చంద్రబాబునాయుడుకు మొదటి నుండి ఓ లక్షణముంది. అదేమంటే తాను అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. అదే ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం తన మాట వినకపోతే సహించలేడు.

పది నెలల క్రితం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదిదే. విషయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి తన పద్దతిలో తాను పనులు చేసుకుంటు వెళిపోతున్నాడు. చంద్రబాబు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎల్లోమీడియాతో వ్యతిరేకంగా ఎన్ని రాతలు రాయిస్తున్నా లెక్క చేయటం లేదు. అందుకనే తనకు బాగా పట్టున్న వ్యవస్ధద్వారా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయటమే విషయంపై నానా రచ్చ చేస్తున్నాడు.

సరే ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయకూడదనే అనుకుందాం. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చేసిందేమిటి ? ప్రభుత్వం అమలు చేసిన పథకాల నిర్మాణాలను మొత్తం పసుపు మయం చేసేశారు కదా ? రక్షిత మంచినీటి పథకం కావచ్చు, అన్న క్యాంటిన్ భవనాలూ కావచ్చు. టిడిపి హయాంలో నిర్మితమైన రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలకంతా పసుపు రంగులు వేసింది వాస్తవం కాదా ? అలాగే అన్న క్యాంటిన్ పేర్లతో కట్టిన నిర్మాణాలకు పసుపు రంగులు వేసింది ఎవరికీ కనబడటం లేదా ? తాము వేసిన పసుపు రంగుల గురించి మాత్రం చంద్రబాబు, చినబాబు నోరెత్తటం లేదు.

అంటే తనకో రూలు ఇతరులకు మాత్రం మరో రూలా ? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబు నేర్చుకున్న రాజకీయం ఇదేనా ? పైగా వైసిపి రంగులు వేయటానికి ప్రభుత్వం రూ. 1300 కోట్లు ఖర్చు పెట్టిందంటూ చినబాబు తప్పుడు ప్రచారం ఒకటి. మహా అయితే ఇప్పటి వరకు వేసిన రంగులకు బాగా ఎక్కువనుకున్నా రూ. 50 కోట్లకు మించి అయ్యుండదు. అలాంటిది ప్రభుత్వంపై బురద చల్లాలన్న ఏకైక ధ్యేయంతో చంద్రబాబు, చినబాబు చేస్తున్న పసుపు రాజకీయంతో వాళ్ళ పైత్యం పరాకాష్టకు చేరుకుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Show comments