iDreamPost
android-app
ios-app

చివరికి పేదల సహాయనిధిని కూడా నొక్కేశారు….బాబు హయాంలో జరిగిన మరోస్కామ్

  • Published Sep 22, 2021 | 11:22 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
చివరికి పేదల సహాయనిధిని కూడా నొక్కేశారు….బాబు హయాంలో జరిగిన మరోస్కామ్

టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి వ్యవహారాలు ప్రజలను తీవ్రంగా కలచివేశాయి. వాటన్నింటికీ 2019లోనే తీర్పు ఇచ్చేశారు. కానీ ఆనాటి అక్రమాల తంతు నేటికీ తవ్వేకొద్దీ బయటపడుతోంది. ఎక్కడా వదలకుండా అవినీతికి పాల్పడిన వైనం వెల్లడవుతోంది. తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులను బొక్కేసిన తీరు బయటపడింది. సీఎంఆర్ఎఫ్ అంటే పేదలకు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకునే ఫండ్. ఆరోగ్య సమస్యలు, ఇతర అత్యవసరాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తారు. ఆ సహాయంలో కూడా అక్రమాలకు పాల్పడిన వారి వ్యవహారాలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు పాలనలో జరిగిన సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్ మాల్ వ్యవహారంలో ఏసీబీ దృష్టి పెట్టింది. 2014 నుంచి సాగిన అవినీతిని వెలికితీస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగినట్లు ప్రాథ‌మిక దర్యాప్తులో ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. పేదలు సంబంధించిన డేటా దుర్వినియోగం చేసి ఈనిధులు కాజేసినట్టు వెల్లడయ్యింది. ప్రకాశం జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఓ వ్యక్తి ఆధార్ కార్డు, ఇతర వివరాలను చూపించి సీఎంఆర్ఎఫ్ సొమ్ములు పక్కదారి పట్టించినట్టు రుజువయ్యింది. ఆరా తీస్తే అలాంటి వ్యవహరాలు అనేకం ఉన్నట్టు తేలింది. తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులు దిగమింగేశారని తేటతెల్లమయ్యింది.

Also Read : పేలిన ఫైబర్‌ నెట్‌ పుట్ట.. సాంబశివరావు అరెస్ట్‌.. వారంతా చిక్కుల్లో

ఈ వ్యవహారంలో అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ విచారణ మొదలయ్యింది. ఇప్పటికే కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ లో సబార్డినేట్లగా పనిచేస్తున్న చదలవాడ సుబ్రమణ్యం, సోకా రమేష్, ప్రజాప్రతినిధి దగ్గర ప్రైవేట్ పీఏ ధనరాజు అలియాస్ నాని, ఒంగోలుకి చెందిన మురళీకృష్ణలను ఏసీబీ అరెస్ట్ చేసింది. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది.

సీఎంఆర్ఎఫ్ లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్ తో నిధులు దిగమింగినట్లు గుర్తించారు. అయితే వారి వెనుక పెద్ద తలకాయులు కూడా ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటివరకు 88 ఫైళ్లలో అక్రమాలని గుర్తించిన ఏసీబీ మరిన్ని ఆధారలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం కూపీలాగితే అసలు నిందితులు బయటపడతారని భావిస్తోంది. కోటి రూపాయిల పైనే అక్రమ లావాదేవీలని బ్యాంకు అకౌంట్ల ద్వారా గుర్తించిన ఏసీబీ అధికారులు, ఇంకా పెద్ద మొత్తంలోనే ఈ స్కామ్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Also Read : జగన్ సర్కార్ ఎక్కడా తగ్గలే…..