Idream media
Idream media
రాష్ట్రంలో అసాంఘిక శక్తులు రాజకీయ రూపం మార్చుకున్నాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. బూతులు తిట్టి తద్వారా భావోధ్వేగాలు రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నాయని సీఎం విమర్శించారు. లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీసే వారెవరైనా సరే ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తూ.. పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
‘‘ రెండేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. అధికారం దక్కలేదని అర్థరాత్రి దేవుని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఆలయ రథాలు తగలపెడుతున్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు దక్కేందుకు వీల్లేదంటున్నారు. మా వాడు అధికారంలోకి రాకపోతే.. ప్రతి రోజు అబద్ధాలనే వార్తలుగా, కథనాలుగా రాస్తూ, డిబేట్లుగా నడుపుతున్న పచ్చ పత్రికలు, పచ్చ ఛానెళ్లను చూస్తున్నాం. మా వాడు అధికారంలో లేకపోతే సీఎంను కూడా భోషిడీకే.. అంటే లంజకొడుకు.. అని ముఖ్యమంత్రిని దారుణంగా తిడుతున్నారు. ముఖ్యమంత్రి తల్లిని దూషిస్తుండడం ఈ రోజు చూస్తున్నాం. ఇది కరెక్టేనా..? ఇలాంటి పనులు చేయడం సరియేనా..? ఇలా తిట్టడం కరెక్టేనా..? ఇలా తిట్టినందుకు సీఎంను అభిమానించే వారు తిరగబడాలి.. రెచ్చిపోవాలి.. భావోధ్వేగాలు రావాలనుకుంటున్నారు. తద్వారా గొడవలు సృష్టించాలనుకుంటున్నారు. రూపం మార్చుకున్న రాజకీయ అసాంఘిక శక్తులను చూస్తున్నాం.
Also Read : YS Jagan – ఓర్వలేక ప్రతిపక్షం వైషమ్యాలు.. మంచి చేయడం ఆపనన్న జగన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అధికారంలోకి రాలేరని రాష్ట్రంపై డ్రగ్స్ ముద్ర వేస్తున్నారు. వీళ్లు టార్గెట్ చేస్తున్నది.. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కాదు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని. ప్రతి ఒక్కరిని. మన పిల్లలను డ్రగ్ ఎడిక్ట్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారు. అది అనైతికం, అధర్మం. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డీఆర్‌ఐ డ్రగ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేదని వివరణ ఇచ్చింది. ఆ వివరణను విజయవాడ సిటీ కమిషనర్ చూపిస్తూ.. మరో సారి చెప్పారు. డీజీపీ ఇదే విషయం చెప్పినా లెక్కలేని తనంతో, అక్కసుతో ఓ పథకం ప్రకారం.. క్రిమినల్ బ్రెయిన్‌తో రాష్ట్రం పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తున్నారు. కళంకిత ముద్ర వేస్తున్నారు.
లా అండ్ ఆర్డర్‌కు టాప్‌మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. తన, మన అనే వ్యత్యాసం వద్దు. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దు. బడుగు బలహీన వర్గాలపై కుల పరమైన దాడులు జరిగితే.. కారకులు ఎవరైనా ఉపేక్షించవద్దు. చట్టం ముందు నిలబెట్టండని పోలీసులకు గుర్తు చేస్తున్నా’’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Sajjala Ramakrishna Reddy – పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల