Idream media
Idream media
రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలను చూసి ప్రతిపక్షం టీడీపీ, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేకే వైషమ్యాలు సృష్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందించే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎవరూ మాట్లాడని విధంగా బూతులు తిట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని.. కానీ ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదని జగన్ గుర్తు చేశారు.
వైషమ్యాలు సృష్టించేందుకే..
రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకే ఓ పథకం ప్రకారం ప్రతిపక్షం ఇలా వ్యవహరిస్తోందని జగన్ అన్నారు. బూతులు తిట్టడం.. దానిపై తనను అభిమానించే వారు, ప్రేమించేవారు తట్టుకోలేక ఓ రియాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రావడం.. ఇలా ఓ పథకం ప్రకారం వైషమ్యాలు సృష్టించి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. మత విధ్వేషాలను కూడా రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రతి మాటలోనూ, రాతలోనూ వక్రబుద్ధి కనిపిస్తోందని మండిపడ్డారు.
మంచిని ఆపేందుకు కోర్టుల్లో కేసులు..
రాష్ట్రంలో ఏ పేదవాడికి మంచి జరగకూడదనేలా ప్రతిపక్షం వ్యవరిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కోర్టుల్లో రకరకాల కేసులు వేస్తున్నారని, మళ్లీ వారే అన్యాయమైన రాతలు రాస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఏ మంచి జరగకూడదని, జరిగితే జగన్‌కు పేరు వస్తుందనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నా.. దేవుడి దయ, అందరి దీవెనలతో రెండున్నరేళ్ల పరిపాలన సంతృప్తిగా సాగిందన్నారు జగన్. ఇంకా మంచి పనులు చేస్తానని, ఏ మాత్రం వెనుకడుగు వేయబోనని జగన్ స్పష్టం చేశారు.
Also Read : Chandrababu U Trun On Bandh-ఏపీ బంద్, మళ్లీ బాబుది యూటర్న్. ఆయన మాటల్లో నాడు-నేడు