Idream media
Idream media
ఓ పక్క తనను, తన కుంటుంబాన్ని దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. తాను మాత్రం తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల అత్యంత అనుచితంగా వ్యవహరిస్తుండడాన్ని చూస్తున్నాం. నిన్న గురువారం చిత్తూరు జిల్లాలో వరద ప్రాంతాలలో పర్యటించిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరద ఉధృతిని, కలిగిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం వైఎస్ జగన్.. అందుకు అనుగుణంగా బాధితులను ఆదుకునేందుకు, నష్టపరిహారం అందించేందుకు తగిన నిర్ణయాలను తీసుకున్నారు.
అయితే సీఎం జగన్ నేరుగా వచ్చి బాధితులతో మాట్లాడలేదంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల వరకు పరిమితమైతే చంద్రబాబు ప్రత్యేకత ఏముంటుంది..? అందుకే ఆయన తన దైన శైలిలో మాట్లాడారు. ‘‘ సీఎం జగన్‌రెడ్డి గాలిలో వచ్చాడు.. గాల్లోనే పోతాడు.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగువుతాడు..’’ అంటూ చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని కూడా హేళన చేసేలా చంద్రబాబు వరద ప్రాంతాల సందర్భనలో మాట్లాడారు. తనను వ్యతిరేకించిన రాజశేఖరరెడ్డి కూడా కాల గర్భంలో కలిసిపోయాడంటూ అనుచితంగా మాట్లాడారు.
తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దూషించినా, విమర్శించినా.. పేరు, సొంత ఊరు పేరును ప్రస్తావిస్తూ అగౌరవ పరిచినా ఇన్నాళ్లు పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉండలేదు. సున్నితంగా చంద్రబాబుకు చురకలు అంటించారు వైఎస్ జగన్. ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన జగన్.. ప్రతిపక్ష నాయకుడు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకు..? మాట్లాడుతుంది ఏమిటి..? అంటూ చురకలు అంటించారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం అంటూ బాబు వ్యక్తిత్వాన్ని ఒక్క మాటలో అభివర్ణించారు సీఎం జగన్.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కొన్ని సార్లు అవి శృతిమించడం కూడా చూస్తుంటాం. కానీ చంద్రబాబు మాదిరిగా.. తన రాజకీయ ప్రత్యర్థి కనుమరుగవ్వాలని గతంలో ఏ నాయకుడు కూడా కోరుకుని ఉండడు. అధికారంలోకి రావాలంటే, వచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలంటే.. ప్రజలకు మంచి చేయాలి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేసి వారి నమ్మకాన్ని గెలవాలి. అప్పుడే మళ్లీ అధికారం అప్పగిస్తారు. అంతేగానీ.. ప్రత్యర్థి బలంగా ఉన్నాడు.. అలాంటి ప్రత్యర్థి ఉన్నంత వరకు తనకు అధికారం రాదని ఆందోళన చెందుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలే కాదు.. కనిపించని దేవుడు కూడా హర్షించడు. తనది గొప్ప కుటుంబమని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఇలాంటి మాటలే గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారు మాట్లాడతారా..? అనే ప్రశ్న ఎవరైనా అడిగితే ఏం చెబుతారో..?
Also Read : Kala Venkata Rao, TDP – మళ్లీ తొలి సంతకం హామీ.. నమ్మేదెవరు కళా..?