iDreamPost
android-app
ios-app

జగన్‌ తపన ప్రధానికి అర్థం అవుతుందా..?

జగన్‌ తపన ప్రధానికి అర్థం అవుతుందా..?

కుంటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం ఆ కుటుంబ పెద్ద ఎలా ఆలోచిస్తారో.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర పెద్ద అయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వైపు పరీక్షలు, చికిత్స అందిస్తున్న జగన్‌సర్కార్‌.. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. అయితే వ్యాక్సిన్‌ కొరత నేపథ్యంలో.. అనుకున్న స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యాక్సిన్లు వేయలేకపోతోంది. రోజుకు దాదాపు 20 లక్షల వ్యాక్సిన్లు వేసే యంత్రాంగం ఏపీ ప్రభుత్వానికి ఉన్నా.. ఆ స్థాయిలో డోసుల సరఫరా జరగడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులల్లో మిగిలిపోయిన వ్యాక్సిన్‌ డోసుల నిల్వలను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ గత నెలలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేగంగా వేయాలనే తపనతో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. తన ప్రతిపాదనను మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ముందు పెట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సినేషన్‌ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో.. సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని ప్రధాని మోదీకి వివరించారు.

రాష్ట్ర విభజన కార ణంగా రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగైన స్థాయిలో లేవని, అయినా.. యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన జరుగతోందని, ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులలో మిగిలిన నిల్వను రాష్ట్రానికి కేటాయించాలని జగన్‌ విన్నించారు. మిగిలిన స్టాకును రాష్ట్రానికి కేటాయిస్తే.. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించగలుగుతామని వివరించారు. జూలై నెలకు రాష్ట్రానికి 53,14,740 వ్యాక్సిన్‌ డోసులను కేటాయించారని, అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్‌ డోసులను కేటాయించారని సీఎం జగన్‌ ప్రధాని మోదీకి గుర్తు చేశారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన డోసులు పూర్తి స్థాయిలో వినియోగమవడంలేదని, మిగిలిన డోసులను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. గతంలో లేఖ ద్వారా చేసిన వినతినే.. తాజాగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తారా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : ప్రతి పదం ఆలోచించి రాశాం.. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్లపై కేంద్ర జలశక్తి శాఖ