Dharani
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె చేసిన పనికి ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటున్నారు. ఆ వివరాలు..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె చేసిన పనికి ప్రతి ఒక్కరు ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఘాటుగా విమర్శలు చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇక పాలనాపరంగా చూసుకుంటే.. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతూ.. కాంగ్రెస్ పాలనపై జనాలకు నమ్మకం కల్గిస్తున్నారు. ఇక అన్నా అంటూ ఎవరైనా సాయం కోరితే వెంటనే స్పందిస్తూ.. తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఇక రేవంత్ బాటలోనే పయనిస్తూ.. అందరి చేత ప్రశంసలు పొందుతుంది ఆయన కుమార్తె నైమిషా రెడ్డి. తాజాగా ఆమె చేసిన పని ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది. ఇంతకు ఏం చేసింది అంటే..
మన సమాజంలో అనాథల పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఎవరైనా దాతలు దయ తలిస్తే ఆదుకుంటేనే వారి జీవితాలు ముందుకు సాగుతాయి. తినడానికి తిండి, ఉండటానికి నీడ.. అదృష్టం బాగుంటే చదువుకునే అవకాశం లభిస్తే.. చాలనుకుంటారు. అంతకు మించిన సంతోషాలు, సౌకర్యాలు లభిస్తే ఇక వారికి మహదానందమే. ఆశ్రమంలో ఉండటం.. పెట్టింది తినడం.. ఇదే వారి జీవితం. బయట ప్రపంచం ఎలా ఉంటుంది.. అక్కడ ఉండే సరదాలు వంటి వాటి గురించి వారికి తెలియదు. ఎవరైనా దాతలు దయతలిస్తే బయటకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అదుగో అలాంటి అనాథల పట్ల తన మంచి మనసు చాటుకున్నారు సీఎం రేవంత్ తనయ నైమిషా రెడ్డి. ఐపీఎల్ మ్యాచ్ చూడటం కోసం వారిని స్టేడియానికి తీసుకెళ్లింది.
హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని బీఎన్ రెడ్డి, సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించి.. సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి. ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్ చూడటం కోసం 30 మంది అనాథ పిల్లలను స్టేడియానికి తీసుకెళ్లింది. నైమిషా రెడ్డే స్వయంగా దగ్గరుండి ఆ పిల్లలను మైదానానికి తీసుకెళ్లినట్లు సమాచారం.
కాగా.. అప్పటివరకు టీవీల్లో మ్యాచ్ చూసి సంబురపడిన ఆ పిల్లలు.. నేరుగా మ్యాచ్ చూస్తూ సంతోషంతో పొంగిపోయినట్లుతెలుస్తోంది. ఆ చిన్నారుల కళ్లల్లో ఆ ఆనందం చూసేందుకే నైమిషా ఈ పని చేసినట్టు.. సన్నిహితులు చెప్పారు. ఓవైపు.. తండ్రి రాజకీయాల్లో అగ్రెస్సివ్ లీడర్‌గా పేరు తెచ్చుకుంటే.. నైమిషా ఇలాంటి మంచి పనులు చేస్తూ.. తండ్రికి తగ్గ తనయగా అందరి చేత ప్రశంసలు పొందుతుంది. ఇవాళ ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు 9.4 ఓవర్లలోనే 166 పరుగుల లక్ష్యాన్ని సింపుల్‌గా చేధించారు