Idream media
Idream media
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంతాట ఆడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు.. మమతా పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను చేర్చుకుని.. దెబ్బతీయాలని చూసిన బీజేపీకి ఇప్పుడు మమత చుక్కలు చూపిస్తోంది. టీఎంసీ నుంచి వెళ్లిపోయిన వారినే కాకుండా బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతలను కూడా చేర్చుకుంటూ కమలం పార్టీకి దిమ్మతిరిగేలా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.
తాజాగా దీదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ మైండ్‌బ్లాక్ అయ్యోలా చేసింది. ఈ సారి దీదీ బీజేపీకి టెక్నికల్ షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన ముకుల్ రాయ్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం తిరిగి సొంత గూటికి వచ్చారు ముకుల్‌రాయ్. ఆయనకు దీదీ కీలక పదవి కట్టబెట్టారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిలో ముకుల్‌ను నియమించారు దీదీ.
ఈ పదవిలో ప్రతిపక్ష పార్టీ నేతను నియమించడం నిబంధన. అయితే ముకుల్ రాయ్ టెక్నికల్‌గా బీజేపీ ఎమ్మెల్యే కావడంతో ఆయనన్ను ఈ పదవిలో కూర్చొబెట్టారు మమత. దీంతో సాంకేతికంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పదవి ఇచ్చిన దీదీ.. అదే సమయంలో ఆ నేత తమ పార్టీలో వ్యక్తిగా ఉండేలా చూసుకున్నారు. ఈ నియామకానికి స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ నియామకాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అయినా సాంకేతికంగా ముకుల్ రాయ్ బీజేపీ ఎమ్మెల్యే కావడంతో.. కమలం పార్టీ నేతలు చేసే ఆందోళన బూడిదలో పోసిన పన్నీరువుతోంది. బీజేపీని ధీటుగా ఎదుర్కొని హాట్రిక్ విజయం సాధించిన దీదీ.. రాబోయో రోజుల్లో కమలం పార్టీకి ఎలాంటి షాక్‌లు ఇస్తారో చూడాలి.
Also Read : అధికారుల పట్ల కోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, అమలులోకి వచ్చేనా..?