iDreamPost
android-app
ios-app

మహాత్ముడి కల సాకారం చేశాం..

మహాత్ముడి కల సాకారం చేశాం..

మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారం చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దింతో పాటు మరి గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన అప్పటి పాలకులు చేయలేదని సీఎం జగన్ విమర్శించారు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశానని సీఎం గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కి కట్టుబడి ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.