Idream media
Idream media
దిశ చట్టం తేవడం వెనుక ఉన్న కారణాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు వెల్లడించారు. మహిళలు, యువతలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు ఎప్పుడూ జరిగేవే.. మన ప్రభుత్వంలో కూడా జరుతాయి కాబట్టి వదిలేద్దాం.. లేదా ఎక్కడో ఒకచోట వీటికి ఫుల్‌స్టాఫ్ పడాలి.. అదేదో మనమే చేద్దాం.. అనే ఆలోచన నుంచే దిశ చట్టం పుట్టింది.. అంటూ సీఎం జగన్ వివరించారు. దిశ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో దిశ స్టేషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి నన్నయ్య యూనివర్సిటీలో దిశ చట్టంపై ప్రసంగించారు.
సినిమాల్లో మహిళలను రేప్ చేసిన వారిని హీరోలు చంపితే.. మనం చప్పుట్లు కొడతాం.. కానీ నిజ జీవితంలో అలా చేయడానికి వీలు లేదు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా.. దోషులకు శిక్ష పడలేదని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ చట్టాలు ఎలా పని చేస్తున్నాయో.. అందులోని లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరించారు. అందుకే చట్టంలో లోపాలు లేకుండా ఘటన జరిగిన తర్వాత వీలైనంత వేగంగా దోషులకు శిక్ష వేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్మమన్నారు.
ఘటన జరిగిన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి. రెండు వారాల్లో విచారణ జరిగిపి దోషులకు ఉరి శిక్ష వేసేలా దిశ చట్టాన్ని రూపాందించామని సీఎం చెప్పారు. ఈ చట్టం ఆమోదానికి కేంద్రానికి పంపామని.. అక్కడ నుంచి వీలైనంత త్వరగా ఆమోదం వస్తుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దిశ కాల్‌సెంటర్, దిశ యాప్..లను మహిళల ఆపద సమయంలో అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తం మీద 18 దిశ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. నేరాలను జరగకుండా ఆపడం కోసమే దిశ చట్టాన్ని తెచ్చామని సీఎం చెప్పారు. ఒక వేళ నేరం జరిగితే ఉరి శిక్ష వేయడం ద్వారా నేరగాళ్లలో ఆ ఆలోచన రాకుండా చేడమేన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా, మేనమామగా మహిళలు, యువత, చిన్నారుల రక్షణ కోసం ఆలోచన చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.